honored former Indian football captain: ఫుట్‌బాల్ (ఫిపా 2022) నిర్వహిస్తున్న ఖతార్ దేశానికి విచ్చేసిన భారత మాజీ ఫుట్‌బాల్ కెప్టెన్ విక్టర్ అమల్‌రాజ్‌ను ఆంధ్ర కళావేదిక, ఇండియన్ కల్చరల్ సెంటర్ (ఐసీసీ) సహకారంతో ఖతార్‌లోని పలువురు క్రీడా, వ్యాపార ప్రముఖులు, తెలుగు సంఘాల అధినేతలు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాట్లాడిన విక్టర్ అమల్రాజ్ ఫిపా 2022 నిర్వహణ తీరును ఫుట్‌బాల్ చరిత్రలోనే అద్భుతమైనదిగా కొనియాడారు.
ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా అమితమైన ఆనందాన్ని పొందానని అన్నారు. తనకు సత్కరించిన ఆంధ్రకళావేదిక, ఐసీసీ కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రముఖ క్రీడాకారులను గౌరవించుకునే అవకాశం ఫిపా 2022 సందర్భంగా కలుగుతోందని.. దానికి మనం ఎంతో అదృష్టం చేసుకున్నామని ఐసీసీ అధ్యక్షులు బాబు రాజన్ పేర్కొన్నారు. భారతదేశం నుంచి ఇలాంటి క్రీడాకారులు ఎవరు వచ్చిన వారిని సత్కరించేందుకు ఐసీసీ అశోక హాల్ని ఉచితంగా కేటాయిస్తామని ఆయన ప్రకటించారు.
భారతదేశ ఫుట్‌బాల్ టీం కెప్టెన్‌గా ఎదిగిన అమల్రాజ్ తెలుగు రాష్ట్రం నుంచి వెల్లడం.. ఆయన్ను మనం సత్కరించుకోవడం చాలా గర్వించ దగ్గ విషయమని ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నపిల్లల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో ఐసీసీ నుంచి బాబు రాజన్, వైస్ ప్రెసిడెంట్ కేఎస్ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు సజీవ సత్యశీలన్, మోహన్, మాజీ ఐసీసీ ప్రెసిడెంట్ మిలన్ అరుణ్, తెలంగాణ జాగృతి నుంచి నందిని అబ్బగొని తదితరులు పాల్గొని అమల్రాజ్ని సత్కరించారు.
ఇవీ చదవండి:
- "డిజిటైజ్, డీకార్బనైజ్, డీసెంట్రలైజ్ అన్న త్రీడీ మంత్రం నెరవేరుతోంది"
- కష్టాల కడలిలో పాలమూరు ప్రభుత్వ వృతి విద్య కళాశాల
- హెటిరోలోకి చిరుత.. ఆఖరికి చిక్కిందిలా!