తమ సమస్యలను పరిష్కరించాలంటూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన రెండు రోజుల సమ్మెలో భాగంగా హైదరాబాద్‌లో ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించిన ఆంధ్రా బ్యాంక్ ఉద్యోగులు.. సైఫాబాద్‌లోని ఆ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
2017 నుంచి రావాల్సిన 11వ వేతన సవరణ, మెర్జర్ ఆఫ్ స్పెషల్ అలెవెన్సు విత్ బేసిక్ పే, స్క్రాప్ న్యూ పెన్షన్ స్కీం, ఫ్యామిలీ పెన్షన్ వంటి 12 డిమాండ్లను పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఉద్యోగులు పేర్కొన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వహించడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రెండు రోజుల సమ్మెకు దిగినట్లు వారు తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా: చైనాలో 212కు చేరిన మృతులు.. ఎమర్జెన్సీ విధింపు