ETV Bharat / state

Anandaiah medicine: ఇవాళ్టి నుంచి ఆనందయ్య ఔషధం పంపిణీ - చంద్రగిరిలో ఆనందయ్య మందు తయారీ న్యూస్

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఔషధం.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులోకి రానుంది. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చొరవతో ఆనందయ్య కుమారుడు, ఆయన శిష్యబృందం నేతృత్వంలో... ఆదివారం రాత్రి ముక్కోటి తీర్థంలో మందు తయారీని ప్రారంభించారు. నియోజకవర్గంలోని 5 లక్షలకు పైగా మందికి ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు.

Anandaiah medicine
చంద్రగిరిలో మందు తయారీ
author img

By

Published : Jun 7, 2021, 7:40 AM IST

చంద్రగిరిలో మందు తయారీ

హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఔషధం పంపిణీకి రంగం సిద్ధం కాగా.. మరోవైపు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకూ ఈ ఔషధం అందుబాటులోకి రానుంది. ఆనందయ్య ఔషధాల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ప్రివెంటెవ్ మెడిసిన్ "పీ" తయారీని..చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముక్కోటి తీర్థంలో ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఆనందయ్య కుమారుడు శ్రీధర్, ఆయన శిష్యబృందం కలిసి ఔషధాన్ని తయారుచేస్తున్నారు.

ఆరు రకాల వనమూలికలు సిద్ధం

ఔషధం తయారీ కోసం చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల అటవీ ప్రాంతాల నుంచి స్థానిక ప్రజలే ఆరు రకాల వనమూలికలు సిద్ధం చేయగా... కృష్ణపట్నం నుంచి ఆనందయ్య మరో పదిరకాల ముడిపదార్థాలను పంపించారు. మొత్తం 16రకాల ఔషధాలతో కూడిన మందు తయారీ చేస్తున్నారు. ఆనందయ్య ఔషధంపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని గౌరవించి.. కరోనా నివారణకు శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే ప్రివెంటివ్ మెడిసిన్​ను మాత్రమే తయారు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు. నియోజక వర్గంలో లక్షా 60 వేల కుటుంబాలకు మందు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశామని చెవిరెడ్డి తెలిపారు.

ఇంటింటికీ తిరిగి పంపిణీ

గ్రామాల్లో లభించే వేప, నేరేడు, మామిడి, నేల ఉసిరి, పిప్పింట, బుడ్డ బుడవ ఆకులు, కొండ పల్లేరు కాయలు, తెల్ల జిల్లేడు పూలు ప్రజలే స్వచ్ఛందంగా పంపించారన్న ఆయన.. మిగిలిన ఔషధాలను, ఫార్మూలా మందును కృష్ణపట్నం నుంచి ఆనందయ్య పంపించారన్నారు. మందు తయారీని వీలైనంత త్వరగా పూర్తి చేసి.. రాబోయే రెండు రోజుల్లోనే నియోజకవర్గ పరిధిలోని 142 గ్రామ పంచాయతీలు, దాదాపు 1,600 గ్రామాలలో ప్రజలకు ఇంటింటికీ తిరిగి పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో రాబోయే రెండు రోజుల్లో పంచిపెట్టే ఆనందయ్య మందు కేవలం వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకే ఉపయోగపడుతుందని చెవిరెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: corona cases: రాష్ట్రంలో కొత్తగా 1,436 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.