సికింద్రాబాద్ మదర్ థెరిసా విగ్రహం వెనుక రైల్వేస్టేషన్ నుంచి గోపాలపురం ట్రాఫిక్ పీఎస్ వైపు వెళ్తున్న రవీందర్ రెడ్డి అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి కర్రతో దాడి చేశాడు. ఘటనా స్థలంలో కుప్పకూలిన బాధితుడిని స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు.
రాజేందర్ అనే వ్యక్తి రవీందర్ రెడ్డిపై దాడి చేసినట్లు వెల్లడించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్రలతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. బాధితుడు వైజాగ్‌కు చెందినవాడిగా.. నిందితుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చూడండి: హోలీ సందర్భంగా కుస్తీ పోటీలు