Revanth Reddy and Jagga Reddy Conversation: రేవంత్‌రెడ్డి దిగిపోయిన తర్వాత తానే పీసీసీ అధ్యక్షుడిని అవుతానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ అవరణలో రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వారిద్దరిమధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని ఇద్దరు నేతలు వెల్లడించారు. తమది తోడికోడళ్ల పంచాయితీ అని... పొద్దున తిట్టుకుంటాం మళ్లీ కలిసిపోతామని జగ్గారెడ్డి వెల్లడించారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు మద్దతిస్తున్నట్లు జగ్గారెడ్డి స్పష్టంచేశారు. ఇంకా పదేళ్లు అయ్యాకా... రేవంత్ రెడ్డి దిగిపోయిన తర్వాత తానే పీసీసీ అధ్యక్షుడిని అవుతానని అన్నారు. ఇప్పట్లో రేవంత్‌ని పదవి నుంచి దింపడం సాధ్యం కాదని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
అనంతరం ఇద్దరు కలిసి సీఎల్పీ కార్యాలయంలోకి వెళ్లారు. అక్కడ రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి జగ్గారెడ్డి, కొప్పుల రాజు, సునీల్ తదితర నేతలు హాజరయ్యారు. ధరణి సమస్యలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు. రాబోయే ఎన్నికల గురించి చర్చించే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: