ఎంసెట్ ఇంజినీరింగ్ మొదటి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు ఆన్లైన్లో రుసుములు చెల్లించి.. కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువు నేటితో ముగిసింది. అయితే ఇంకా కొందరు అభ్యర్థులు ప్రక్రియ పూర్తి చేయనందున... రేపటి వరకు అవకాశం కల్పించినట్లు కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే ఇప్పుడు పొందిన సీటు రిజర్వ్ అవుతుందని.. లేకపోతే రద్దవుతుందని కన్వీనర్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:'పుర పోరు కొత్త షెడ్యూల్ జారీ'