ETV Bharat / state

ఇంగ్లండ్ యువకుడి నోట.. వెల్లువలా తేట తెలుగు మాట

ఈ మధ్య మనవాళ్లే తెలుగు సరిగా మాట్లాడడం లేదు. పరాయి భాషపై మోజుతో మాతృభాషను పక్కన పెట్టేస్తున్నారు. కానీ.. ఎక్కడో వేల మైళ్ల అవతల.. ఇంగ్లండ్​లో ఓ వ్యక్తి.. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడి ఆశ్చర్యపరిచాడు. తనతో తెలుగులోనే మాట్లాడాలంటూ ఆకట్టుకున్నాడు.

ఇంగ్లండ్​ యువకుడి నోట తెలుగు మాట
author img

By

Published : Jul 10, 2019, 5:57 PM IST

ఇంగ్లండ్​ యువకుడి నోట తెలుగు మాట

వన్డే ప్రపంచ కప్ జరుగుతున్న ఇంగ్లండ్​లో.. తెలుగు వికసించింది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీస్​కు వేదికైన మాంచెస్టర్​లో.. మన తెలుగువాళ్లే ఆశ్చర్యపోయేలా ఓ వ్యక్తి స్పష్టమైన తెలుగులో మాట్లాడాడు. ఆట చూసేందుకు వెళ్లిన కొందరు ఆంధ్రులు ఓ దుకాణానికి వెళ్లగా.. వారు షాక్ అయ్యేలా పలకరించాడు. ''తెలుగులో చెప్పండి.. ఇంగ్లీష్​లో కాదు'' అంటూ.. స్వచ్ఛమైన తెలుగు మాట్లాడాడు. ''తెలుగును మరిచిపోవద్దు.. మంచి భాష'' అంటూ ఆంధ్ర భాషపై మమకారాన్ని చాటుకున్నాడు. తాను రెండేళ్ల పాటు.. ఆంధ్రప్రదేశ్​లోని.. విశాఖ, విజయవాడలో ఉన్నానని చెప్పాడు. ''మీరంతా ఏ ఊరి నుంచి వచ్చారు?'' అని ఆప్యాయంగా పలకరించాడు. ఇంగ్లండ్ కు చెందిన వ్యక్తి.. అంతటి తేట తెలుగు మాట్లాడేసరికి మనవాళ్లు ఆనందంతో చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టారు.

ఇదీ చూడండి : రైల్వేశాఖలో 2 లక్షల 98 వేల ఉద్యోగాలు

Intro:ap_knl_21_10_acb_raids_ab_AP10058
యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీవో( ప్రాంతీయ రవాణా కార్యాలయం) కార్యాలయంలో ఏసీబీ( అవినీతి నిరోధక శాఖ) అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయంలో అనధికారికంగా ఉన్న నలుగురు వ్యక్తులను గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.39000 స్వాధీనం చేసుకున్నారు. చలనాకు సంబందం లేని ఈ మొత్తాన్ని ఎందుకు కలిగి ఉన్నారో అనే విషయాన్ని అధికారులకు నివేదిస్తామని ఏసీబీ డిఎస్పీ తెలిపారు.
బైట్, నాగభూషణం, డిఎస్పీ, ఏసీబీ

Body:ఏసీబీ దాడులు

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.