కరోనా ఎఫెక్ట్: అఖిలపక్ష సమావేశం ప్రారంభం - కాంగ్రెస్
హైదరాబాద్ ఎగ్జిబిషన్ మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. లాక్‌డౌన్ అమలుతో పేదల ఇబ్బందులు, బియ్యం, నగదు పంపిణీలో లోపాలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయం, పాలనాపరమైన లోపాలు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. సమావేశానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డితోపాటు ఆ పార్టీ సినీయర్ నేత హనుమంతరావు, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్, ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తదితరులు హాజరయ్యారు.