హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్‌షో ముగిసింది. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా... వారాసిగూడకు బయలుదేరారు. భూపేందర్ యాదవ్, లక్ష్మణ్, బండి సంజయ్‌లతో కలిసి రోడ్‌షో లో పాల్గొన్నారు. వారాసిగూడ నుంచి కొంత దూరం రోడ్‌షో నిర్వాహించారు. శ్రేణులు భారీగా తరలిరావడంతో రహదారులన్ని కాషాయమయమయ్యాయి. జనసేన కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. వాహనంపై నుంచి అమిత్ షా చేతులు ఊపుతూ.. అభివాదం చేస్తూ.. స్థానికులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రహదారులన్నీ జనసంద్రం కావడంతో.. రోడ్ షో వేగంగా కదలలేదు. ఫలితంగా సమయాభావంతో సీతాఫల్‌మండి చేరకుండానే అమిత్ షా రోడ్‌షో ముగించారు.
రోడ్డు షో ముగిసిన అంతరం భాజపా రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. ముందుగా మీడియా సమావేశం అనంతరం.. సాయంత్రం వరకు భాజపా నేతలతో సమావేశమవుతారు. అనంతరం బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి... అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు.
బల్దియా ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో... అమిత్ షాను భాజపా రంగంలోకి దింపింది. ఆఖరి రోజు అమిత్ షా ప్రచారం మంచి ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
- ఇదీ చూడండి: భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన అమిత్ షా