ETV Bharat / state

బీఆర్ఎస్ గెలిస్తే ప్రజల సొత్తు లూటీ - అందుకే కేసీఆర్​ను గద్దె దించాలని తెలంగాణ ఫిక్స్ అయింది : అమిత్​ షా - తెలంగాణలో అమిత్​ షా ఎన్నికల ప్రచారం

Amit Shah Fires on KCR Government : రాష్ట్రంలో మరోసారి భారత్​ రాష్ట్ర సమితిని గెలిపిస్తే.. సీఎం కేసీఆర్‌ ప్రజల సొమ్ము లూటీ చేస్తారని కేంద్రమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సోమాజిగూడలో మాట్లాడిన ఆయన.. పదేళ్ల పాలనలో బీఆర్​ఎస్​ సర్కార్‌ భారీగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఆ పార్టీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదన్న కేంద్రమంత్రి.. ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే.. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

Amit Shah Election Campaign in Hyderabad
Amit Shah Fires on KCR Government
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2023, 12:33 PM IST

Updated : Nov 25, 2023, 12:52 PM IST

Amit Shah Fires on KCR Government : తెలంగాణలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని గొప్పగా చెప్పిన కేసీఆర్​ సర్కార్..​ వాటిని పూర్తి చేయలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్‌ చేసి కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. హైదరాబాద్​లో భూముల వేలంలో రూ.4 వేల కోట్ల అవినీతి జరిగిందని.. ఔటర్‌ రింగ్‌రోడ్డు లీజు వేలంలోనూ భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. ప్రస్తుతం ప్రజలకు బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై నమ్మకం పోయిందన్నారు. హైదరాబాద్​ సోమాజిగూడలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.

Amit Shah Election Campaign in Hyderabad : రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ఇప్పటికీ పూర్తి చేయలేదని అమిత్​ షా విమర్శించారు. నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తామని చెప్పి విస్మరించారని మండిపడ్డారు. 4 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామన్నారని.. అదీ జరగలేదన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం కూడా నిర్వహించటం లేదన్న ఆయన.. ఎంఐఎంకు భయపడి ముస్లిం రిజర్వేషన్లు కల్పించారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామని పునరుద్ఘాటించారు. కేసీఆర్‌ సర్కార్‌ను గద్దె దించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు.

ఆఖరి ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం-ఐదు రోజుల పాటు జాతీయ నేతల కోలాహలం

Telangana Assembly Elections 2023 : బీజేపీ అధికారంలోకి రాగానే.. వరికి క్వింటాల్‌కు రూ.3100 చెల్లిస్తామని అమిత్ షా తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌పై అన్ని రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గిస్తే కేసీఆర్‌ తగ్గించలేదని.. తాము అధికారంలోకి వస్తే.. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఆడపిల్లల పేరు మీద రూ.2 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తామని వివరించారు. ఈ క్రమంలోనే దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ 2014లో అన్నారని గుర్తు చేసిన కేంద్రమంత్రి.. ఇప్పటికీ ఆ హామీ అలాగే మిగిలి పోయిందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో మూడు రోజుల పాటు ప్రధాని మోదీ ప్రచారం- ఆరు సభలు, హైదరాబాద్​లో రోడ్​ షో, షెడ్యూల్ ఇదే

బీఆర్​ఎస్​ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయింది. కేసీఆర్‌ సర్కార్‌ను గద్దె దించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తాం. వరికి క్వింటాల్‌కు రూ.3100 చెల్లిస్తాం. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిస్తాం. కాంగ్రెస్‌ వాళ్లను గెలిపిస్తే.. వెళ్లి బీఆర్​ఎస్​లో కలుస్తారు. బీఆర్​ఎస్​ను గెలిపిస్తే.. ప్రజల సొమ్ము లూటీ చేస్తారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌ వస్తేనే.. తెలంగాణలో అభివృద్ధి సాధ్యం. - అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి

బీఆర్ఎస్ గెలిస్తే ప్రజల సొత్తు లూటీ అందుకే కేసీఆర్​ను గద్దె దించాలని తెలంగాణ ఫిక్స్ అయింది అమిత్​ షా

బీఆర్​ఎస్​ను​ గెలిపిస్తే.. ప్రజల సొమ్ము లూటీ.. : బీఆర్​ఎస్​ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీ నేతలు ప్రజల సొమ్మును లూటీ చేస్తారని అమిత్​ షా విమర్శించారు. కాంగ్రెస్‌ వాళ్లను గెలిపిస్తే.. వెళ్లి బీఆర్​ఎస్​లో కలుస్తారని జోస్యం చెప్పారు. సబ్‌ కా సాత్‌.. సబ్‌ కా వికాస్‌... బీజేపీ విధానమన్న ఆయన.. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే.. బీసీ నేతను సీఎంగా చేస్తామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌ వస్తేనే.. తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలవుతాయి : అమిత్‌ షా

బీజేపీ ప్రభుత్వం రాగానే - మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తాం : అమిత్​ షా

Last Updated : Nov 25, 2023, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.