Amit Shah at 75th Batch IPS Passing Out Parade in Hyderabad : వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు నేడు భారత్లో సవాళ్లు విసురుతున్నాయని అమిత్ షా పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీతో దేశ ఆర్థికవ్యవస్థ బలహీనానికి యత్నిస్తున్నారని.. హవాలా, నకిలీ నోట్ల కట్టడికి మరింత పటిష్ఠంగా పోరాడాలని సూచించారు. శిక్షణ పూర్తైన ఐపీఎస్లు ఈ సమస్యలపై పోరాడతారనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
75th Batch IPS Passing Out Parade in Hyderabad : హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో 75వ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్లో ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ట్రైనీ ఐపీఎస్ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ బ్యాచ్లో శిక్షణ పూర్తి చేసుకున్న 175 మంది ట్రైనీ ఐపీఎస్లకు కృతజ్ఞతలు తెలిపారు. టాపర్గా నిలిచిన కాలియాకు బహుమతి ప్రదానం చేశారు. అనంతరం తెలుగు రాష్ట్రాలకు 14 మంది ట్రైనీ ఐపీఎస్ల(Trainee IPS)ను కేటాయించారు.
Trainee IPS Parade in Hyderabad : రేపు ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ పరేడ్.. ముఖ్య అతిథిగా అమిత్ షా
Amit Shah Telangana Tour : ఆంగ్లేయుల కాలం నాటి 3 నేర చట్టాలు సీఆర్‌పీసీ, ఐపీసీ, ఎవిడెన్స్ను మార్చాల్సి ఉందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. మూడు చట్టాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసి.. పార్లమెంటు ముందు ఉంచిందని గుర్తు చేశారు. త్వరలోనే నేర చట్టాలకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందుతుందని అమిత్ షా అన్నారు. ఆంగ్లేయుల చట్టాలు పోయి.. భారత్ చేసిన కొత్త చట్టాలతో ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. శాసనాలను సురక్షితంగా ఉంచడమే పాత చట్టాల ఉద్దేశమని.. ప్రజల అధికారాలను సురక్షితంగా ఉంచడం కొత్త చట్టాల ఉద్దేశమని వివరించారు.
"దేశం శతాబ్ది ఉత్సవాల్లో ఉన్నప్పుడు ప్రస్తుత ట్రైనీ ఐపీఎస్లు కీలక స్థానాల్లో నిలబడతారు. దేశం రుణం తీర్చుకోవటానికి మీకు ఎంతో మంచి అవకాశం లభించింది. దేశాన్ని ప్రపంచంలోనే ముఖ్య స్థానంలో నిలపడానికి మీకు సదవకాశం వచ్చింది. దేశాన్ని రాబోయే 25ఏళ్లలో ప్రపంచంలో అన్ని రంగాల్లో నిలిపేందుకు ప్రధాని మోదీ ప్రణాళిక రచించారు. దీన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మీరంతా మీవంతు పాత్ర పోషించాలి. ఎన్పీఏ ఏర్పడిన 75 ఏళ్లలో ఎంతో మంది ఐపీఎస్లకు ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకొని దేశానికి సేవ అందించారు." - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
-
Addressing the ‘Dikshant Parade’ of the 75 RR IPS probationers at SVPNPA, Hyderabad. https://t.co/1rwlWPgHiH
— Amit Shah (@AmitShah) October 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Addressing the ‘Dikshant Parade’ of the 75 RR IPS probationers at SVPNPA, Hyderabad. https://t.co/1rwlWPgHiH
— Amit Shah (@AmitShah) October 27, 2023Addressing the ‘Dikshant Parade’ of the 75 RR IPS probationers at SVPNPA, Hyderabad. https://t.co/1rwlWPgHiH
— Amit Shah (@AmitShah) October 27, 2023
Trainee IPS Parade in Hyderabad : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని.. ఐపీఎస్ శిక్షణ పొందిన వారిలో మహిళలు ఉన్నారని అమిత్ షా(Amit Shah) తెలిపారు. ఎన్నో సంఘర్షణల తర్వాత భారత్కు స్వాతంత్య్రం వచ్చిందని.. మహానుభావుల బలిదానాల ద్వారా స్వాతంత్య్రం లభించిందని చెప్పారు. నేడు విశ్వయవనికపై భారత్ సత్తా చాటుతోందని ఉద్ఘాటించారు. కర్తవ్య నిర్వహణలో 36 వేలకు పైగా పోలీసులు బలిదానాలు ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం సూర్యాపేటలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు.