ETV Bharat / state

కర్నూలులో కల్యాణ్‌రామ్‌ సందడి.. అమిగోస్‌ ట్రైలర్‌ విడుదల - Amigos Movie Srirama Talkies Latest News

Amigos Trailer Release at Kurnool: ఏపీలోని కర్నూలులో సినీ నటుడు కల్యాణ్ రామ్‌ సందడి చేశారు. కల్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రం ట్రైలర్‌ను.. స్థానిక శ్రీరామ టాకీస్‌లో విడుదల చేశారు. సినిమా తప్పక విజయం సాధిస్తుందని కల్యాణ్ రామ్ పేర్కొన్నారు.

Kalyan Ram
Kalyan Ram
author img

By

Published : Feb 4, 2023, 3:38 PM IST

Amigos Trailer Release at Kurnool: కథానాయకుడు నందమూరి కల్యాణ్​రామ్​ హీరోగా నటించిన సినిమా 'అమిగోస్'​. ఈ చిత్రం ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రం ట్రైలర్​ను.. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలులో స్థానిక శ్రీరామ టాకీస్‌లో విడుదల చేశారు​. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని కల్యాణ్ రామ్ తెలిపారు. ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఇందులో మూడు కోణాల్లో సాగే పాత్రలో కల్యాణ్​రామ్ కనిపించారు. కల్యాణ్​రామ్​ సరసన అషికా రంగనాథ్​ నటించింది. ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్రఫర్​గా ఎస్‌. సౌందర్‌రాజన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్​గా అవినాష్‌ కొల్లా, ఎడిటర్​గా తమ్మిరాజు పనిచేశారు. ఈ సినిమా ద్వారా రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్‌ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 'ఎమిగోస్‌' అంటే తెలుగులో స్నేహితులు అని అర్థం. 'బింబిసార'తో గతేడాది ఘన విజయాన్ని సొంతం చేసుకున్న కల్యాణ్‌రామ్‌ నుంచి ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రాల్లో ఇదొకటి.

కర్నూలులో కల్యాణ్‌రామ్‌ సందడి.. అమిగోస్‌ ట్రైలర్‌ విడుదల

ఇవీ చదవండి: సమీకృత, సమ్మిళిత, సమగ్ర అభివృద్ధికి తెలంగాణ దిక్సూచి: కేటీఆర్

విద్యుత్​ సైకిల్ రూపొందించిన పదో తరగతి విద్యార్థి.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 90 కి.మీ ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.