హైదరాబాద్ బాలానగర్‌కు ముగ్గురు విదేశీయులు వచ్చారు. నవజీవన్నగర్లో నివాసముంటున్న ఓ వ్యక్తి ఇంటికి అమెరికా నుంచి ముగ్గురు వ్యక్తులు రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
స్పందించిన బాలానగర్ సీఐ వాహేదుద్దీన్ వారిని అదే ఇంట్లో ఉంచి జీహెచ్ఎంసీ అధికారులు, వైద్య సిబ్బందిని రప్పించారు. విదేశీయులతో పాటు ఇంట్లో ఉన్న వారందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
ప్రస్తుతం వారందరూ ఆరోగ్యంగానే ఉన్నారని, కుటుంబ సభ్యులందరిని 14 రోజుల పాటు ఇంట్లోనే ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.
- ఇదీ చూడండి:- కరోనా వ్యాప్తిని అరికట్టే ఆయుధాలు ఇవే..