వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభ సౌజన్యంతో కళా సుబ్బారావు కళావేదికలో నెలనెలా తెలుగు వెన్నెల 154వ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ రచయిత డా.వంగూరి చిట్టెన్‌రాజు రచించిన "అమెరికా కులాస కథలూ- కమామీషులూ" పుస్తకాన్ని ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిట్టెన్‌రాజు చమత్కార రచనలు చేయడంలో సిద్ధహస్తుడని సిధారెడ్డి ప్రశంసించారు. చిట్టెన్‌రాజును ప్రపంచస్థాయి హాస్యరచయితగా హస్యబ్రహ్మ శంకర్ నారాయణ అభివర్ణించారు.
ఇవీ చూడండి: అతని కంట పడితే "గుంత" మాయం