అంబేడ్కర్ విగ్రహాన్ని పోలీస్స్టేషన్ నుంచి విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కాంగ్రెస్ సినీయర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు అన్నారు. ఫిబ్రవరి 5 లోపు అంబేడ్కర్ విగ్రహాన్ని పోలీసులు ఇవ్వకపోతే ప్రాణాలు అర్పిస్తానని వీహెచ్ స్పష్టం చేశారు.
రాజ్యాంగం లిఖించిన నాయకునికి ఇంత అవమానం జరుగుతుంటే ఏ నాయకుడు మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానికే ఉందని ఆరోపించారు.
ఇదీ చూడండి : రామోజీ ఫిలింసిటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు