డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించే విధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని... 'అంబెడ్కర్ ఫొటో సాధన సమితి' డిమాండ్ చేసింది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయాలని సీఎం కేసీఆర్‌కు సమితి జాతీయ అధ్యక్షుడు జెర్రిపోతుల పరశురామ్ హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విజ్ఞప్తి చేశారు.
పార్లమెంట్లో తమ వాణి వినిపించేందుకు ఈ నెల 25 నుంచి 30వరకు దిల్లీ యాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టి, ముఖద్వారం వద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని పరశురామ్ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 153 గ్రాముల కొకైన్, 16 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం