అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ అర్హత పరీక్షలో 7 వేల 418 మంది ఉత్తీర్ణులయ్యారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ గత నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహించగా.. తాజాగా ఫలితాలను విడుదల చేసింది.
తెలంగాణ, ఏపీల్లో 8 వేల 971 మంది పరీక్ష రాయగా.. 7 వేల 418 మంది అర్హత సాధించినట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. వివిధ జైళ్లల్లో 153 మంది ఖైదీలు పరీక్ష రాయగా.. వారిలో 129 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు, మార్కుల మెమోల కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ను చూడాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఘనంగా జేఎన్టీయూహెచ్ తొమ్మిదో స్నాతకోత్సవం