పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్లకు నివాళిగా హైదరాబాద్ రవీంద్రభారతిలో శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించారు. ప్రాజ్ఞిక ఫౌండేషన్, ప్రాజ్ఞిక ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 'దేశం కోసం మీరు-మీ కోసం మేము' పేరిట ఏర్పాటు చేశారు. దేశరక్షణ కోసం అసువులు బాసిన వీర జవాన్ల త్యాగాల గురించి అందరూ గొప్పగా కీర్తిస్తారు. వారి కుటుంబం మాత్రం కుంగిపోతుందని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య తెలిపారు. అలాంటి కుటుంబాలకు ప్రభుత్వం తోడుగా నిలిచి భరోసా ఇవ్వాలని సూచించారు. వీర మరణం పొందిన జవాన్ల సతీమణులను 'వీరపత్నిలకు అమర్‌వీర్' అవార్డుతో పాటు రూ.5 వేల నగదును అందజేశారు.
ఇవీ చదవండి :పరీక్షా కాలం