Amaravati farmars allege that the AP government is misusing CRDA Act: ఏపీ రాజధాని అమరావతి రైతులు సీఆర్డీఏ సవరణపై తమ అభ్యంతరాలు, సూచనలతో వినతిపత్రం సమర్పించారు. జగన్ ప్రభుత్వం సీఆర్డీఏ సవరణతో అమరావతిని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. సీఆర్డీఏ రైతులతో చేసుకున్న ఒప్పందాలు తుంగలో తొక్కుతోందని విమర్శించారు. 29 గ్రామాల్లో ఇతరులకు సెంటు భూమి ఇవ్వడం భావ్యం కాదని అన్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం 5శాతం రాజధానిలో ఇళ్లు లేనివారికి ఇళ్లు కేటాయించాలని రైతులు డిమాండ్ చేశారు.
గ్రామ సభలు నిర్వహించి, రైతుల ఆమోదం తర్వాతనే పేదలకు సెంటు భూమిని కేటాయించాలన్నారు. గ్రామ సభలు నిర్వహించకుండా అధికారులు ఏకపక్షంగా సెంటు భూమిని పేదలకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారన్న రైతులు.. ఇది సీఆర్డీఏ చట్టానికి విరుద్ధమని ఆక్షేపించారు. దీనిపై రైతులు వ్యక్తిగతంగా సీఆర్డీఏ అధికారులకు వినతిపత్రం సమర్పించామని తెలిపారు. ఇప్పటికే 20వేల పత్రాలు సమర్పించామన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల అభిప్రాయం సీఆర్డీఏ అధికారులు పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమని రైతులు విచారం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: