ETV Bharat / state

Maha Padayatra 10th day: అమరావతి ఆకాంక్ష.. పల్లవించె ప్రతినోటా.. - amaravathi maha padayatra latest news

ఏపీలో "న్యాయస్థానం నుంచి దేవస్థానం" పేరిట అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర.. ఉత్సాహంగా సాగుతోంది. నేడు పదోరోజున దుద్దుకూరు నుంచి నాగులుప్పలపాడు వరకు 14 కి.మీ పాదయాత్ర సాగనుంది.

Maha Padayatra
Maha Padayatra
author img

By

Published : Nov 10, 2021, 11:56 AM IST

ఆంధ్రప్రదేశ్​ అమరావతి రైతుల మహా పాదయాత్ర పదో రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లా నాలుగో రోజుకు చేరిన యాత్ర.. నేడు దుద్దుకూరు నుంచి మొదలుకానుంది. 14 కి.మీ సాగిన తర్వాత నాగులుప్పలపాడులో పాదయాత్ర ముగియనుంది. రాచపూడిలో మధ్యాహ్న భోజన విరామం ఉంటుంది. రాత్రి నాగులుప్పలపాడులోనే రైతులు బస చేయనున్నారు.

నిన్న ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లులో మంగళవారం ఉదయం 8.30 గంటలకు మొదలైన పాదయాత్ర.. కొణికిపల్లె, కొణికి మీదుగా దుద్దుకూరుకు సాయంత్రం 5.30 గంటలకు చేరింది. దాదాపు 10.5 కిలోమీటర్ల దూరం అశేష జనసందోహం మధ్య పాదయాత్ర సాగింది. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన విద్యార్థులు, మహిళలు, వృద్ధులు దారిపొడవునా పెద్ద సంఖ్యలో నిల్చొని స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించారు. పాదయాత్రలో తాము సైతం అంటూ కిలోమీటర్ల కొద్దీ నడిచారు.

ఆంధ్రప్రదేశ్​కు.. అమరావతి ఒక్కటే రాజధానిగా కొనసాగించాలని నినదిస్తూ.. అమరావతి రైతులు, మహిళలు మహాపాదయాత్ర చేపట్టారు. 45 రోజులు రైతుల మహాపాదయాత్ర కొనసాగనుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేపట్టారు. డిసెంబర్ 15న పాదయాత్ర తిరుమలకు చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. రైతుల మహాపాదయాత్రకు అన్ని వర్గాల నుంచి సంఘీభావం లభిస్తోంది.

తెలంగాణ నుంచీ మద్దతు..

తెలంగాణలోని ఖమ్మం తెదేపా పార్లమెంట్‌ అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వందమందికి పైగా వచ్చి సంఘీభావం తెలిపారు. విశాఖపట్నం గాజువాకకు చెందిన ఎర్ర మాధవీలత యాత్రలో పాల్గొని రూ.5వేలు విరాళం అందజేశారు. సంతమాగులూరు మండలం నుంచి 85 సంవత్సరాల వృద్ధుడు గోరంట్ల పెద్ద సుబ్బారావు ఇంకొల్లు వరకు వచ్చి అక్కడినుంచి 10కి.మీ. నడిచారు. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ శివారెడ్డి, ఐకాస కోకన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌, మహిళా ఐకాస కన్వీనర్‌ రాయపాటి శైలజ దుద్దుకూరులో విలేకర్లతో మాట్లాడారు. మహా పాదయాత్రకు రాష్ట్రంలో85% మందినుంచి మద్దతు లభిస్తోందన్నారు.

రూ.20 లక్షల విరాళాలు

పాదయాత్ర కోసం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ కొల్లూరి నాయుడమ్మ ఆధ్వర్యంలో ఇంకొల్లుకు చెందిన 154 మంది రూ.5.64 లక్షలు విరాళంగా అందజేశారు. చినగంజాం మండలం గొనసపూడి వాసులు రూ.2,09,116 ..భీమవరం వాసులు రూ.1,82,200 ..మార్టూరు ప్రజలు రూ.1,51,116 ..నాగండ్లకు చెందిన సోమేపల్లి శివప్రసాద్‌ రూ.లక్ష, గొల్లపాలెం గ్రామస్థులు రూ.84 వేలు, సంతరావూరు నుంచి రూ.70 వేలు, హనుమోజీపాలెం స్థానికులు రూ.29 వేల విరాళంగా అందించారు. మొత్తంగా మంగళవారం ఒక్క రోజే సుమారు రూ.20 లక్షల విరాళాలు అందాయి.

జగన్​కు అమరావతి బహుజన ఐకాస లేఖ..

రాజధాని రైతుల పాదయాత్రకు ఆటంకాలు కల్పిస్తున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య మండిపడ్డారు. రైతుల పాదయాత్రకు అవరోధాలు కల్పించాలని చూస్తే ప్రభుత్వానికే నష్టమని, ప్రజలు క్షమించరని మంగళవారం సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ‘‘మహా పాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించగానే పోలీసులు రైతుల్ని ఇబ్బందిపెడుతున్నారు. వందల మంది మెహరించి భయోత్పాతాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. డ్రోన్‌ కెమెరాలతో యాత్రను ఇష్టారీతిన చిత్రీకరిస్తున్నారు. మీరెవరని ప్రశ్నించినందుకు మహిళలతో దురుసుగా ప్రవర్తిస్తూ తిరిగివారిపైనే ఫిర్యాదు చేస్తున్నారు. నిర్వాహకుల్ని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రైతుల యాత్రకు సహకరించేలా డీజీపీని ఆదేశించాలి. లేనిపక్షంలో మీ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో బోనెక్కించక తప్పదు’’ అని హెచ్చరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.