Amaravarhi farmars maha padayatra: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి రైతుల పాదయాత్రపై పోలీసులు మరోసారి జులుం చూపారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పసలపూడిలో యాత్ర సాగుతుండగా పోలీసులు అడ్డగించారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ పక్కకు నెట్టివేశారు. అమరావతి పరిరక్షణ సమితి నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. వారందరినీ పోలీసు నెట్టివేశారు. పాదయాత్ర చేస్తున్న రైతులు, మహిళల ఐడీకార్డులు చూపించాలని పోలీసులు వారిని నిలువరించారు. దీంతో పోలీసులకు, యాత్రికుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఐకాస నేతలపై పోలీసులు చేయి చేసుకున్నారు.
పోలీసుల తోపులాటలో పలువురు మహిళలు, వృద్ధులు కిందపడిపోయారు. మహిళలను సైతం ఇష్టానుసారం పోలీసులు లాగిపడేశారు. రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన యువకులను అడ్డుకుని ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై మహిళా రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తాము భూమలు కోల్పోయి న్యాయం కోసం రోడ్డెక్కితే.. ప్రభుత్వం, పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇవీ చదవండి: