విద్యార్థులు టెక్నాలజీని వినియోగించుకోని నూతన ప్రయోగలు చేయాలని హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్, హెచ్సీయూ ఛాన్సలర్ జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి సూచించారు. పూర్వ విద్యార్థులు కళాశాలకు అందిస్తున్న విశేష సేవలు, కృషిని ప్రశంసించారు. వీరిని స్ఫూర్తిగా లక్ష్యాలను ఎంచుకోని ఆ దిశలో రాణించాలన్నారు. ఆదివారం ఓయూ టెక్నాలజీ కళాశాల ఆడిటోరియంలో జరిగిన టెక్నాలజీ కళాశాల 4వ గ్లోబల్ ఆలూమిని మీట్-2019లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 4సంవత్సరాల్లో కళాశాల అభివృద్ధి కోసం నాలుగు ప్రయోగశాలలు ఆధునికీకరించామని ఆలూమిని అధ్యక్షుడు ఏ.భాస్కర్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల పరిశోధన వికాసం, ఉపాధి కల్పనతో పాటు శిక్షణకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కళాశాల భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు.
గోల్డెన్ జూబ్లీ సందర్భంగా జి+3 గోల్డెన్ జూబ్లీ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని కోరితే ఆలూమిని సుముఖత వ్యక్తం చేయడం హర్షణీయమని కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఆర్.శ్యామ్ సుందర్ అన్నారు. ఈ సందర్భంగా వివిద రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులను సత్కరించారు. వారు నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపారు. ప్రధాన కార్యదర్శి యం.రాజా మహేందర్ రెడ్డి, ఓయూ మాజీ రిజిస్టర్, మెంబర్ ప్రొ.యం.భగవంత రావు, వైస్ ప్రిన్సిపల్ రమేష్ కుమార్ తదిరులు పాల్గొన్నారు.