ETV Bharat / state

అల్లూరి సీతారామరాజు పాత్రలో మెప్పించిన ఎన్​ఎస్​వో ఆఫీసర్​

Sitaramaraju Played Role Of Deshaboina Bharatraj: ఉద్యోగంతో పాటు.. కళలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ స్టాటిస్టికల్​ ఆఫీసర్​ అందరి మన్ననలు పొందుతున్నారు. చిన్నప్పటి ఇప్పటివరకు ఎన్నో పాత్రలను వేస్తూ తన అభిరుచిని చాటుకుంటున్నారు. అయితే తాజాగా గణతంత్ర దినోత్సవాన్నిపురస్కరించుకొని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర వేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు.

NSO Officer Deshaboina Bharatraj
ఎన్​ఎస్​వో ఆఫీసర్ దేశబోయిన భరత్‌రాజ్
author img

By

Published : Jan 26, 2023, 4:22 PM IST

Alluri Ramaraj Played Role Of Statistical Officer: హైదరాబాద్‌లో సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ దేశబోయిన భరత్‌రాజ్ ఏకపాత్రాభియనం ఆకట్టుకుంది. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్‌లో జరిగిన వేడుకలలో తన ప్రతిభను చాటుకున్నారు. జాతీయ పతాకం ఆవిష్కరణ అనంతరం ఈ ప్రదర్శన నిర్వహించారు. స్వతహాగా కళాకారుడైన ఆయన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వేషధారణలో ఏక పాత్రాభినయం చేశారు.

ఏకపాత్రాభినయం తిలకించిన జాతీయ గణాంక కార్యాలయం ఉన్నతాధికారులు భరత్‌రాజ్‌ను అభినందించారు. మొదటి నుంచి స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, ఇతర జాతీయ దినోత్సవాలు వంటి శుభ సందర్భాల్లో మయసభ దుర్యోధనుడు, ఇతర పాత్రలను అనుకరిస్తూ ఏకపాత్రాభినయం చేయడం ఓ అభిరుచిగా పెట్టుకుని సహచరులతో శభాష్ అనిపించుకుంటున్నారు. అలాగే ఆయుర్వేద వైద్యం, మానసిక ఉల్లాసం, చక్కటి ఆరోగ్యం సొంతం చేసుకోవడానికి ఇతోధికంగా దోహదపడే ధ్యానం, యోగాసనాలపై విస్తృతంగా ప్రచారం చేయడంలో ఆయన కృషి చేస్తుండటం విశేషం.

అల్లూరి పాత్రలో ఎన్​ఎస్​వో సీనియర్​ ఆఫీసర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.