ETV Bharat / state

జోనల్​ విధానానికి అనుగుణంగా కొలిక్కిరాని పోస్టుల విభజన - తెలంగాణ ఉద్యోగ సమాచారం

నూతన జోనల్ విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో పోస్టుల విభజన చేయకపోవడం ఇప్పుడో సమస్యగా మారింది. 31 జిల్లాలకు అనుగుణంగా కొత్త విధానానికి రాష్ట్రపతి ఆమోదముద్ర లభించినప్పటికీ అమలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. పోస్టుల వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేస్తే నూతన విధానానికి అనుగుణంగా లేదంటే పాత 10 జిల్లాల ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేయాల్సి ఉంటుంది.

జోనల్​ విధానానికి అనుగుణంగా కొలిక్కిరాని పోస్టుల విభజన

author img

By

Published : Dec 23, 2020, 6:00 AM IST

జోనల్​ విధానానికి అనుగుణంగా కొలిక్కిరాని పోస్టుల విభజన

నూతన జోనల్ విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో పోస్టుల విభజన చేయకపోవడం సమస్యగా మారింది. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణ పది జిల్లాలను 2 జోన్లుగా విభజించారు. పది జిల్లాలు ఐదు, ఆరు జోన్లలో కొనసాగాయి. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం స్థానికులకు ఎక్కువగా ఉద్యోగాలు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనల్ విధానాన్ని తీసుకొచ్చింది. అప్పటివరకు ఉన్న 31 జిల్లాలను ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా విభజించారు. కొత్త జోనల్ విధానానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. అందుకు అనుగుణంగా నూతన విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

అమలుకు నోచుకోని ప్రతిపాదనలు

ములుగు, నారాయణపేట జిల్లాలను చేర్చడంతో పాటు వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్​లో చేర్చాలన్న ప్రతిపాదన రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. కొత్త విధానం నేపథ్యంలో అందుకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలను జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల వారీగా విభజించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రభుత్వం గతంలో ప్రారంభించింది. అన్ని శాఖలు ఆయా జిల్లాల వారీగా పోస్టులను విభజించి పంపాయి. అయితే పోస్టుల వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియ మాత్రం ఇంకా పూర్తి కాలేదు.

ఏ విధానం పాటిస్తారో..?

గతంలో స్టేట్ కేడర్​లో ఉన్న డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ఇపుడు మల్టీజోనల్ కేటగిరీకి మార్చారు. అందుకు అనుగుణంగా ఆ పోస్టులను వర్గీకరించి నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తైతేనే కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. త్వరలో 50వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ఏ విధానం ప్రకారం వెళ్తారన్నది ఇపుడు చర్చనీయాంశమైంది.

అయితే అటు.. లేకుంటే ఇటే..

వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకపోతే పాత జోనల్ విధానం ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టవచ్చని అంటున్నారు. కొత్త జిల్లాల ప్రకారం రిక్రూట్ మెంట్ చేస్తేనే స్థానిక అభ్యర్థులకు న్యాయం జరుగుతుందన్న వాదన ఉంది. న్యాయపరంగా చిక్కులు ఎదురు కాకుండా అనుసరించాల్సిన వ్యూహంపై సర్కారు దృష్టి సారించింది. ఖాళీల విషయమై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత దీనికి సంబంధించి తుదినిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి: పర్యవేక్షణ లేకపోవడం వల్ల కల్తీ దందా సాగుతోంది: పద్మనాభరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.