ETV Bharat / state

ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్వం చేసే కుట్రలో భాగమే..: చాడ - తెలంగాణ వార్తలు

విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు కార్మిక సంఘాలు ఐక్యంగా నిర్మాణాత్మక పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వామపక్ష నేతలు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. దీనిని ఆత్మ నిర్భరత​గా పేర్కొనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

all-trade-unions-protest-against-privatization-of-ap-vishaka-steel-factory-in-hyderabad
ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్వం చేసే కుట్రలో భాగమే..: చాడ
author img

By

Published : Mar 5, 2021, 5:25 PM IST

ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్వం చేసే కుట్రలో భాగమే..: చాడ

ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్ర చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. దానిలో భాగంగానే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. అందుకు నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్​లో రాష్ట్ర కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన బంద్ విజయవంతమైందని... అఖిలపక్ష నాయకులతో చర్చించి ఏపీ సీఎం జగన్ నిర్మాణాత్మక పోరాటాలు నిర్వహించాలని ఆయన సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు కార్మిక సంఘాలు ఐక్యంగా నిర్మాణాత్మక పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కోరారు.

ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేటు పరం చేయడానికి పూనుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ ప్రకటన చేయడం సమంజసం కాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. దీనిని ఆత్మ నిర్భరత​గా పేర్కొనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో టీఎన్​టీయూసీ రాష్ట్ర నేత బోస్, ఐన్​టీసీ నేత చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కరెంట్​ పోతోంది... జనరేటర్​ ఇవ్వండి: జీహెచ్​ఎంసీ మేయర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.