ETV Bharat / state

ఓటు ఉన్నవారంతా చైతన్యంతో ముందుకు రావాలి

దాదాపు 12 జిల్లాలకు చెందిన 36వేల మంది ఎన్నికల సిబ్బంది, 9,101 పోలింగ్‌ కేంద్రాలు, 52 వేల మందితో పటిష్ఠ బందోబస్తు.. వందల కోట్ల వ్యయం.. ఇలా బల్దియా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతీ అంశం విశేషమే. యంత్రాంగం రేయింబవళ్లు శ్రమించి మంగళవారం జరిగే ఎన్నికల కోసం భారీ ఏర్పాట్లు చేసింది. ఇదంతా ఎందుకంటే.. మన మహానగరానికి అయిదేళ్ల పాటు చక్కటి భవితవ్యం కోసం.. ఈ తరుణంలో ఓటు ఉన్నవారంతా చైతన్యంతో ముందుకు వచ్చి తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటేయాల్సిన తరుణమిది. నా ఒక్క ఓటు ఏం చేస్తుందిలే అన్న నిర్లిప్త భావన విడనాడి ‘కదలండి ముందుకు.. ఓటేసేందుకు’’.

All those have the vote must come forward with consciousness in ghmc elections 2020
ఓటు ఉన్నవారంతా చైతన్యంతో ముందుకు రావాలి
author img

By

Published : Dec 1, 2020, 7:37 AM IST

మహా నగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నువ్వా.. నేనా అన్నట్లు జరుగుతోన్న పోరులో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సింది ఈ రోజే. సోమవారం రాత్రికే పోలింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ పెట్టెలు, ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. నేటి (మంగళవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఓటు వేసేందుకు ఓటర్లను అనుమతిస్తారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ ముగిసేందుకు అధికారులు పోలింగ్‌ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూంల వద్ద పకడ్బందీ బందోబస్తు ఏర్పాటుచేశారు. నాలుగో వంతు కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ జరగనుంది.

  • నగరంలోనే మొదటిసారి డివిజన్‌కు ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటర్ల ముఖాన్ని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ ఉపయోగిస్తున్నారు.
  • కొవిడ్‌ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని అన్ని కేంద్రాలను యంత్రాంగం క్రిమి సంహారక ద్రావణంతో శుద్ధి చేసింది.
  • మాస్కు ధరించిన ఓటర్లనే అనుమతిస్తామని స్పష్టం చేసింది.

కొవిడ్‌ బాధితులకు ప్రత్యేక వరుస

కొవిడ్‌ బాధితులకు ఇప్పటికే తపాలా ఓటు వేసే అవకాశం కల్పించారు. దీనికి దరఖాస్తు చేసుకోనివారికి ప్రత్యేక క్యూ కేటాయించి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని జీహెచ్‌ఎంసీ తెలిపింది.

పోలింగ్‌ సందర్భంగా నేడు సెలవు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా మంగళవారం సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఫ్యాక్టరీస్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టం 1974, 1988 ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని పరిశ్రమలు, ఉద్యోగులు, కార్మికులందరికీ వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని తెలిపింది. ఓటింగ్‌ రోజు సెలవు ప్రకటించని సంస్థలు, యజమానులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌ జాజు ఒక ప్రకటనలో తెలిపారు.

మీ కేంద్రం ఎక్కడుందంటే

నగరంలో పోలింగ్‌ కేంద్రాల చిరునామా కనుక్కోవడం సాంకేతికతతో సులువైంది. గ్రేటర్‌ ఎన్నికల్లో ఈసారి అదనంగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో ఓటేసిన చోట కాకుండా ఈసారి కొత్త కేంద్రాల్లో వేయాల్సి రావడంతో సులువుగా గుర్తించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ‘మైజీహెచ్‌ఎంసీ’ మొబైల్‌ యాప్‌లో ‘లొకేట్‌ యువర్‌ పోలింగ్‌ స్టేషన్‌’ అని లింక్‌ను క్లిక్‌ చేస్తే జీపీఎస్‌ సాయంతో దారిచూపిస్తుంది. ఓటరు గుర్తింపుకార్డు విశిష్ఠ సంఖ్య, వార్డు, ఓటరు పేరును జోడించి వివరాలు పొందవచ్ఛు.

క్యూ ఆర్‌ కోడ్‌ సాయంతో

కొందరు అభ్యర్థులు క్యూఆర్‌కోడ్‌ ముద్రించి పోలింగ్‌ చీటీలు పంపిణీ చేశారు. మొబైల్‌ నుంచి క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌ చేయగానే పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో గూగుల్‌ మ్యాప్స్‌లో చూపిస్తుంది. డైరెక్షన్స్‌ క్లిక్‌ చేస్తే దారి చూపిస్తుంది. మన్సూరాబాద్‌లో ఓ అభ్యర్థి తన డివిజన్‌ పరిధిలోని ఓటర్లకు క్యూఆర్‌కోడ్‌ చీటీలను అందించారు.

ఇదీ చూడండి: లైవ్ అప్​డేట్స్ : ప్రారంభమైన బల్దియా ఎన్నికల పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.