హైదరాబాద్ జలసౌధలో ఈఎన్‌సీ మురళీధర్‌తో అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. ఈఎన్‌సీ మురళీధర్‌ను తెజస, సీపీఐ, న్యూడెమోక్రసీ నేతలు కలిశారు. పోతిరెడ్డిపాడు అంశం, ప్రభుత్వ వైఖరిపై నేతలు వినతిపత్రం ఇచ్చారు.
కృష్ణా జలాల పరిరక్షణ, ప్రభుత్వ నిర్లక్ష్యంపై వివరించామని తెజస అధ్యక్షుడు కోదండరామ్ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ జీవో అమలైతే శ్రీశైలం ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారుతాయని అభిప్రాయపడ్డారు. జీవో 203 ఉపసంహరణ కోసం ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ సత్వరమే పూర్తి చేయాలని చెప్పారు.
ఏపీ ప్రభుత్వ జీవో ఉపసంహరణకు కృషి చేయాలని చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం నాయకత్వంలో అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలని కోరారు. అవసరమైతే ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని సూచించారు. కృష్ణా జలాలు పరిరక్షించకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుందని వివరించారు.
ఇవీ చూడండి: తడిసిన నయనం.. ఆగని పయనం