చివరి విడత కౌన్సిలింగ్లో ఫార్మసీ సీట్లు పొందినవారు ఈనెల 9 లోగా కళాశాలల్లో చేరాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బైపీసీ అభ్యర్థులకు అందుబాటులో సీట్లన్నీ భర్తీ అయినట్లు ఆయన వెల్లడించారు.
బీఫార్మసీ, ఫార్మ్‌డీ, బయోటెక్నాలజీ కోర్సుల్లో 120 కళాశాలల్లో ఉన్న 7,982 సీట్లను మూడు దఫాలుగా అభ్యర్థులకు కేటాయించారు. చివరి విడత కౌన్సిలింగ్లో 1,975 సీట్లను కేటాయించగా....మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు దాదాపు 2,111 మంది తమ సీటును మార్చుకున్నారు.