ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి దీక్ష చేస్తున్న కూనంనేని సాంబశివరావును దౌర్జన్యంగా అరెస్ట్ చేశారని సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. సాంబశివరావును అభినందించారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయాలని కేసీఆర్ గట్టి నిర్ణయంతో ఉన్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ మొండివైఖరి అవలంబిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి అఖిలపక్షం అండగా ఉంటుందని తెజస అధ్యక్షుడు కోదండరాం చెప్పారు. సమ్మెపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కాంగ్రెస్ నేత వీహెచ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ భరోసానిచ్చారు. తమకోసం నిరాహార దీక్షకు దిగిన కూనంనేనికి ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. నేతల కోరిక మేరకు దీక్ష విరమించిన్నట్లు కూనంనేని తెలిపారు. ఆర్టీసీకి మద్దతుగా పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు.
ఇదీ చూడండి : కుటుంబం సహా ట్యాంక్ ఎక్కిన కాంట్రాక్టర్