ETV Bharat / state

INDEPENDENCE DAY CELEBRATIONS: పార్టీ కార్యాలయాల్లో స్వాతంత్ర్య సంబురాలు

రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు అంబరాన్నంటాయి. ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.... పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పలుచోట్ల నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

all-parties-celebrated-independence-day-in-their-party-offices
అంబరాన్నంటిన స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు
author img

By

Published : Aug 15, 2021, 1:55 PM IST

వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు పంద్రాగస్టును ఘనంగా నిర్వహించాయి. తమ కార్యాలయాల్లో శ్రేణులతో కలిసి మువ్వన్నెల జెండాను ఆవిష్కరిస్తూ.... ప్రజలకు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను నేతలు గుర్తుచేసుకున్నారు..

భాజపా కార్యాలయంలో..

భాజపా రాష్ట్ర కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 75ఏళ్ల స్వాంతంత్ర్య భారతావని అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని స్పష్టం చేశారు..

తెలంగాణ భవన్‌లో..

తెరాస రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కేశవరావు జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన పార్టీ శ్రేణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం బాగా పెరిగిందన్న కేకే..... తెలంగాణలో మరో కొత్త ఉద్యమం వచ్చిందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఉక్కు సంకల్పంతో 'దళితబంధు' తీసుకువచ్చారని... ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నట్లు చెప్పారు.

సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో..

హిమాయత్ నగర్​లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిదని చాడ వెంకట్ రెడ్డి అన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో..

దేశ సార్వభౌమత్వాన్ని, స్వాలంబనను, ఆర్థిక ప్రయోజనాలను దేశ ప్రజలకు అందే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని సీపీఎం పొలిట్​ బ్యూరో సభ్యుడు వి.రాఘవులు అన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్​లోని రాష్ట్ర సీపీఎం కార్యాలయంలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

భాజపా ఓబీసీ మోర్చా కార్యాలయంలో..

75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ముషీరాబాద్​లో భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజలందరూ కృషి చేయాలని సూచించారు.

తెజస రాష్ట్ర కార్యాలయంలో..

హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెజస రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక ఉద్యమాల ఫలితంగా స్వాతంత్య్రం సాదించుకున్నామని... బ్రిటీష్ వాళ్ళు దేశ ప్రజలపై గుత్తాధిపత్యం చెలాయించారని తెలిపారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబానికి అప్పజెప్పడానికి సాదించుకోలేదని... తెలంగాణలో స్వపరిపాలన కోరుకున్నామని కోదండ రాం అన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: CM KCR Speech: అన్ని రంగాల్లో గుణాత్మక, గణనీయ అభివృద్ధి: కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.