ETV Bharat / state

'ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాలి'

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసి... యుద్ధప్రాతిపదికన మౌలిక సదుపాయాలు చేపట్టాలని అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆస్పత్రులు నిర్వీర్యం అవుతున్నాయని ఆరోపించారు.

All Party Leader's At King Koti Hospital

author img

By

Published : Aug 24, 2020, 5:58 PM IST

కింగ్​కోఠిలోని హైదరాబాద్ జిల్లా కొవిడ్​ ఆస్పత్రిని అఖిలపక్ష నాయకులు సందర్శించారు. తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్​.రమణ, తెజాస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆస్పత్రిని పరిశీలించారు. కరోనా బాధితులకు ఇస్తున్న చికిత్స, తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆస్పత్రి సూపరింటెండెంట్​ శంకర్​ను అడిగి తెలుసుకున్నారు.

'ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవాలి'

ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉన్నప్పటికీ... కొవిడ్ పేషెంట్లు రావడం లేదని... ప్రభుత్వం మీద నమ్మకం లేకనే బాధితులు రావడంలేదని వారు ఆరోపించారు. సౌకర్యాలు ఉన్నా... పేషంట్లు రావడం లేదని ఈ విషయంపై ప్రభుత్వమే ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు సామాన్య ప్రజలతో పాటు... ప్రజాప్రతినిధులు కూడా రావాలని కోరారు.

ఇదీ చూడండి: త్వరలో తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.