హైదరాబాద్ విద్యుత్ గిరిజన భవన్లో ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో విధులకు వెళ్తున్న లంబాడి ప్రభుత్వ ఉపాధ్యాయులను అడ్డుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ సంఘం అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్ డిమాండ్ చేశారు. లంబాడి ప్రభుత్వ ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆదివాసీ..లంబాడి తెగల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఎంపీని అరెస్ట్ చేయాలని....ఈ విషయంపై భాజపా రాష్ట్ర నాయకత్వం తన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: విశ్వవిద్యాలయాల సిబ్బంది వేతనాల పెంపు