రాష్ట్రంలో జరగనున్న అన్ని పరీక్షలు దసరా వరకు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దసరా తర్వాత పరీక్ష తేదీలు ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఓయూ, జేఎన్టీయూహెచ్, కేయూ, తదితర యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి.
వర్షాల కారణంగా ఈనెల 14 నుంచి జరగాల్సిన పరీక్షలను ఇప్పటికే వాయిదా వేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు ఈనెల 31 వరకు పొడిగించామని మంత్రి వివరించారు. మరో రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నందున దసరా వరకు పరీక్షలన్నీ వాయిదా వేశారు.
ఇదీ చదవండి : తమిళనాడు సీఎం పళనిస్వామికి కేసీఆర్ ఫోన్