ETV Bharat / state

4 Years Degree Course: కొత్త డిగ్రీ కోర్సులన్నీ నాలుగేళ్లే..! - డిగ్రీ కోర్సు

4 Years Degree Course In Telangana: ఇక నుంచి కొత్త డిగ్రీ కోర్సులు అన్నీ నాలుగేళ్లుగా చేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తగిన సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. కంప్యూటర్​ సైన్​ మూడేళ్ల కోర్సులో మొదటగా బీఎస్​సీ ఆనర్స్​ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు తాజాగా తెలిపారు.

degree
degree
author img

By

Published : Apr 21, 2023, 1:23 PM IST

4 Years Degree Course In Telangana: రాష్ట్రంలోని డిగ్రీ కోర్సులను ఇక నుంచి నాలుగేళ్ల కాలపరిమితితో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే (2023-2024) నుంచే డిగ్రీలో కంప్యూటర్​ సైన్స్​ మూడేళ్ల కోర్సులో బీఎస్​సీ ఆనర్స్​ కోర్సును ప్రవేశపెట్టాలని విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా విద్యార్థుల్లో సైబర్​ సెక్యూరిటీ వంటి వాటి మీద అవగాహన రావడానికి దానిని నాలుగేళ్లకు పెంచే ఆలోచనలో ఉన్నారు.

ఈ బీఎస్​సీ నాలుగేళ్ల కోర్సులో కంప్యూటర్​ సైన్స్​ను ఒక సబ్జెక్టులా కాకుండా పూర్తిస్థాయిలో బోధించేలా.. అందుకు తగిన విధంగా సిలబస్​ను రూపకల్పన చేయనున్నారు. కోర్సులో భవిష్యత్తులో సైబర్​ దాడుల నుంచి రక్షణ కల్పించుకునేందుకు.. అలాగే టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కృత్రిమ మేధ, సైబర్​ సెక్యూరిటీ, బ్లాక్​చైన్​ టెక్నాలజీ వంటి తదితర అంశాలను బోధిస్తారు.

మూడేళ్లు కోర్సు చేసే వారికి సాధారణ డిగ్రీ.. నాలుగేళ్లు అయితే ఆనర్స్​ డిగ్రీ: ఇదే విషయంపై ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ ఆచార్య ఆర్​.లింబాద్రి తదితరులతో యూజీసీ ఛైర్మన్​ మామిడాల జగదీశ్​కుమార్ వర్చువల్​గా మాట్లాడారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సుతో పాటు ఇతర విషయాలపై చర్చించారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు అంటే విద్యార్థుల్లో నిలకడ లోపిస్తుందని.. వారికి చాలా కష్టమవుతుందని, అర్హులైన అధ్యాపకుల కొరతా ఉందన్న అభిప్రాయాలను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు లేవనెత్తారు. అందుకే తాము కొత్తగా ప్రవేశపెట్టనున్న బీఎస్​సీ ఆనర్స్​ ఇన్​ కంప్యూటర్​ సైన్స్​ను మూడేళ్లకే నిర్ణయించామని యూజీసీ ఛైర్మన్​కు వివరించారు.

దానిని నాలుగేళ్లకు పెంచడానికి వీలవుతుందని అభిప్రాయపడి.. ఇకపై ప్రవేశపెట్టే కోర్సులను మాత్రం నాలుగేళ్లతో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని యూజీసీ ఛైర్మన్​ తెలిపారు. ఒకవేళ విద్యార్థులు ఎవరైనా తాము మూడేళ్ల డిగ్రీ కోర్సును మాత్రమే చేస్తామని చెప్పి వెళ్లిపోతే.. నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం ఎగ్జిట్​ ఆప్షన్​ ఇస్తామని చెప్పారు. అప్పుడు మూడేళ్లు డిగ్రీ చేసేవారికి సాధారణ డిగ్రీ.. నాలుగేళ్లు డిగ్రీ చేసేవారికి ఆనర్స్​ డిగ్రీ పట్టాలను ఇవ్వవచ్చని సమావేశంలో నిర్ణయించారు.

అసలు నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ఎలా ప్రవేశపెడతారు: రాష్ట్రంలోని 10కి పైగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొదట ఈ కంప్యూటర్​ సైన్స్​ ఆనర్స్​ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు ప్రైవేట్​ కళాశాలలకు కూడా అనుమతి ఇస్తారు. అందుకు సంబంధించిన నోటిఫికేషన్​ ఉన్నత విద్యామండలి విడుదల చేస్తుంది. డిగ్రీలో ఏటా 2.50 లక్షల మంది చేరుతున్నందున వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ లింబాద్రి అన్నారు. వారు నాలుగేళ్లు కోర్సు చేయడం వల్ల నేరుగా పీహెచ్​డీలో చేరొచ్చని.. విదేశీ విద్యకు వెళ్లేందుకు కూడా ఆస్కారం ఉందని వివరించారు.

ఓయూలో ట్విన్నింగ్‌ డిగ్రీ కోర్సు: ఉస్మానియా యూనివర్సిటీలో.. బీటెక్​ తరహాలోనే సైన్స్​లో కూడా నాలుగేళ్ల ఆనర్స్​ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారు. ఆ కోర్సును రెండేళ్లు ఉస్మానియాలో.. మరో రెండేళ్లు ఆస్ట్రేలియాలో పూర్తి చేసేలా అవకాశం కల్పించాలనే ఆలోచనతో ఉన్నారు. ప్రస్తుతం ఇలాంటి ట్విన్నింగ్​ కోర్సులను ప్రవేశపెట్టేందుకు అమెరికా, బ్రిటన్​ కసరత్తు ప్రారంభించాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.