హైదరాబాద్ బేగంపేట్‌లోని మెట్రో రైల్ కార్యాలయంలో నిర్వహించిన నగర సమన్వయ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ హాజరయ్యారు. నగరంలో వర్షాలు కురుస్తున్న సమయంలో రోడ్లన్నీ పాడవుతున్నాయనీ.. యుద్ధ ప్రాతిపాదికన వాటికి మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశానికి దానకిషోర్తో పాటు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ హరీశ్, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఇదీ చూడండి: మీ పిల్లలకు ఇలాంటి ఆహారమే పెడతారా?