రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ విభాగం.. 'విజయ సంకల్ప శిబిరం' పేరుతో హైదరాబాద్ ఎల్బీనగర్లోని సరూర్ నగర్ స్టేడియంలో సాయంత్రం భారీ సభ ఏర్పాటు చేసింది. సభ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మావతి అవార్డు గ్రహీత, బోర్డు ఆఫ్ గవర్నర్స్ ఐఐటీ ఛైర్మన్ బి. వి.ఆర్ మోహన్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్లు హాజరుకానున్నారు.
ప్రధాన వేదికపై 16 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. మైదానంలో సుమారు 25 వేల మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకి సభ ప్రారంభం అవుతుందని అంతకు ముందే 4 చోట్ల నుంచి ర్యాలీగా వచ్చి ఎల్బీనగర్లో సంఘ్ సభ్యులు కలుసుకొని ర్యాలీకి సభా స్థలానికి చేరుకుంటారు.
ఇవీ చూడండి: క్రిస్మస్ వేళ మంచులో సైనికుల సంబురాలు