ETV Bharat / state

అతివలకు అండగా "అలీప్" ​ ప్రదర్శన - telangana latest news

ALEAP wekart exhibition in hyderabad: గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి అతివలను 'అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా' ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో తమ ఉత్పత్తులను విక్రయించడానికి అవకాశం కల్పించింది. ఇక్కడ లభిస్తున్న అలంకరణ సామగ్రి, చిరుధాన్యాల ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, సౌందర్య సాధనాల కొనుగోలు కోసం వినియోగదారులు తరలివస్తున్నారు.

"అలీప్" ​ ప్రదర్శన
"అలీప్" ​ ప్రదర్శన
author img

By

Published : Feb 25, 2023, 1:09 PM IST

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో "అలీప్" ​ ప్రదర్శన

ALEAP wekart exhibition in Hyderabad: హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా- A.L.E.A.P ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ప్రదర్శన-2023 జరుగుతోంది. కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న అలీప్‌ ఎగ్జిబిషన్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. "మేక్ ఇన్ ఇండియా"లో భాగంగా 100 పైగా స్టాళ్లు కొలువుతీరాయి. ఆయా స్టాళ్లను గవర్నర్‌ పరిశీలించారు.

ALEAP Exhibition in Hyderabad : తెలుగు రాష్ట్రాల్లోని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు రూపొందించిన భిన్న రకాల ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. చేతి వృత్తుల ఉత్పత్తులు, హస్త కళలు, చేనేత వస్త్రాలు, గాజులు, ఔషధ, సుగంధ, ఆయుర్వేద ఉత్పత్తులు, పిల్లనగ్రోవి, సువాసన గల అగరు బత్తీలు, గానుగ నూనెలు, సేంద్రీయ ఉత్పత్తులు, పూత రేకులు, చిరుధాన్యాలతో తయారు చేసిన వివిధ రకాల చిరుతిళ్లు, పిండి, రవ్వ, తినుబండారాలు, ఇంటి అలంకరణ సామగ్రి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా.... ఎలాంటి లాభాపేక్ష లేకుండా అలీప్‌ పనిచేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అతివలు ఎదిగేందుకు మార్గదర్శిగా నిలుస్తోంది. ఆరోగ్యకర ఉత్పత్తులు, చిన్నారులు అబ్బురపడే రీతిలో తయారు చేసిన సబ్బులు, యువతులు మెచ్చే సౌందర్య సాధనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అమ్మకాలు బాగున్నాయని వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ-కామర్స్ వెబ్‌సైట్, వుయ్‌కార్ట్ వేదికల ద్వారా మహిళలకు విస్తృతమైన మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు అలీప్‌ అధ్యక్షురాలు రమాదేవి తెలిపారు. జేమ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా వ్యాపారం చేసుకోవచ్చన్నారు. ఆదివారం వరకు ప్రదర్శన జరగనుంది. వారాంతంలో నగరవాసులు పెద్దఎత్తున వస్తారని వ్యాపారులు ఆశిస్తున్నారు. త్వరలో అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు అలీప్ సన్నద్ధమవుతోంది.

"ఈ-కామర్స్ వెబ్‌సైట్, వుయ్‌కార్ట్ వేదికల ద్వారా మహిళలకు విస్తృతమైన మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తున్నాము. వాళ్లు తయారుచేసిన ఉత్పత్తులను మార్కెట్​లోకి అలీప్​ ద్వారా సులభంగా తీసుకురావచ్చు. వారి ఉత్పత్తులను దేశవ్యాప్తంగా వ్యాపారం చేసుకోవచ్చు." -రమాదేవి, అలీప్‌ అధ్యక్షురాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.