ETV Bharat / state

బీఆర్ఎస్‌కు షాక్‌ - కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే అబ్రహం

Alampur MLA Abraham Joins Congress : బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఓ ఎమ్మెల్యే తాజాగా పార్టీని వీడారు. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహం హస్తం గూటికి చేరారు. రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

Alampur MLA Abraham
Alampur MLA Abraham
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2023, 12:14 PM IST

Updated : Nov 24, 2023, 1:34 PM IST

Alampur MLA Abraham Joins Congress : తెలంగాణలో ఎన్నికలకు సమయం (Telangana Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ.. పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఓవైపు సభలు, సమావేశాలతో నేతలు.. మరోవైపు ఇంటింటి ప్రచారాలతో అభ్యర్థులు ఓట్ల వేటలో పడ్డారు. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల్లోని అసమ్మతి నేతలను తమవైపు తిప్పుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఎవరైనా అసమ్మతి రాగం వినిపిస్తున్నారని తెలిస్తే చాలు.. వారిని పార్టీలోకి చేర్చుకునేందుకు పోటీ పడుతున్నారు.

MLA Abraham Left BRS Joined in Congress : ఎలాగైనా గెలవాలనే తపనతో ఉన్న పార్టీలు ఏ అవకాశాన్ని జార విడుచుకోవడం లేదు. తాజాగా అధికార బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం (MLA Abraham).. కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి హస్తం పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం అబ్రహం అలంపూర్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కానీ ఈసారి గులాబీ పార్టీ టికెట్ దక్కలేదు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార జోరు - మేనిఫెస్టో వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR) ఆగస్ట్ 21న.. ప్రస్తుత ఎమ్మెల్యే అబ్రహంకే టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ దీనిని ఆ జిల్లా బీఆర్ఎస్‌ నాయకుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి.. వ్యతిరేకిస్తూ వచ్చారు. చల్లా.. తన అనుచరుల్లో ఒకరైన విజయుడికి అవకాశం కల్పించాలని సీఎంను కోరారు. మరోవైపు అబ్రహంకే టికెట్‌ ఇవ్వాలని ఆయన అభిమానులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. పలు సందర్భాల్లో అబ్రహం కూడా మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులను కలిసి ఇదే విషయాన్ని విన్నవించారు. కానీ చివరికి విజయుడికే.. బీఆర్ఎస్‌ టికెట్‌ను కేసీఆర్ ఖరారు చేశారు.

సమయం లేదు మిత్రమా - అసెంబ్లీ పోలింగ్​కు ఈసీ చకచకా ఏర్పాట్లు

టికెట్ దక్కకపోవడంపై ఎమ్మెల్యే అబ్రహం స్పందించారు. అలంపూర్‌ ఎస్సీ నియోజకవర్గంలో చల్లా వెంకట్రామిరెడ్డి ఆధిపత్యం ఏంటని ప్రశ్నించారు. తననే ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారని.. కానీ చల్లా దౌర్జన్యంతో బీ ఫామ్‌ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అందుకు బాధగా ఉందని వాపోయారు . చల్లా వెంకట్రామిరెడ్డి, విజయుడు ఎప్పుడైనా జై తెలంగాణ అన్నారా, జెండా పట్టారా అంటూ అబ్రహం ధ్వజమెత్తారు.

మరోవైపు తొలి విడతలో మొత్తం 115 మంది అభ్యర్థులను కేసీఆర్‌ ప్రకటించారు. అందులో బీ ఫామ్‌లు ఇచ్చే నాటికి కనీసం అయిదారు స్థానాల్లోనైనా మార్పులు ఉండొచ్చనే ప్రచారం జరిగింది. అయితే, ప్రకటించిన వారిలో అభ్యర్థిత్వంలో మార్పు జరిగి బీ ఫామ్‌ దక్కని అభ్యర్థి ఒక్క అబ్రహం మాత్రమే.

రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్​ - రంగంలోకి దిగుతున్న అగ్రనేతలు

ఆఖరి ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం-ఐదు రోజుల పాటు జాతీయ నేతల కోలాహలం

Last Updated : Nov 24, 2023, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.