రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డ క్షతగాత్రులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో 3 కిమీ అవగాహన పరుగును నిర్వహించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పౌర సరఫరాల శాఖ సంచాలకుడు అకున్ సబర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పీపుల్స్ ప్లాజా నుంచి జలవిహార్ వరకు చేపట్టిన ఈ పరుగులో వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని గంటలోపు ఆసుపత్రికి తరలిస్తే వారి ప్రాణాలు కాపడవచ్చని అకున్ పేర్కొన్నారు. రోడ్డుపైనే వదిలేయకుండా వారికి ప్రాణదానం చేయాలని సూచించారు.
ఇదీ చూడండి : యురేనియం నిక్షేపాలున్నా... అనుమతివ్వం: కేటీఆర్