ETV Bharat / state

'నిర్భయ దోషులెమైనా దేశ భక్తులా.. ఎందుకు కాపాడుతున్నారు'

author img

By

Published : Mar 18, 2020, 8:51 PM IST

నిర్భయ దోషుల కేసు విషయంలో దోషుల తరఫు న్యాయవాదులు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై అఖిల భారత జన్​సంఘ్ మండిపడింది.

Akhila bharatha jan sangh on nirbhaya victims
'వారు ఏమైనా దేశభక్తులా? ఎందుకు అడ్డుపడుతున్నారు?'

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అవమానిస్తూ... అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లిన నిర్భయ న్యాయవాదులను వెంటనే డిస్మిస్‌ చేయాలని అఖిల భారతీయ జన్​సంఘ్‌ డిమాండ్‌ చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ... అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. న్యాయ పరిధిలో దాదాపు 8 ఏళ్లుగా విచారణ జరిగి... ఇప్పుడు శిక్ష పడితే ఎందుకు అడ్డుకుంటున్నారని అఖిల భారతీయ జన్​సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌ మండిపడ్డారు. వీరు ఏమైనా దేశభక్తులా? లేకపోతే సంఘసేవకులా? ఎందుకు వారిని కాపాడాలని అరాటపడుతున్నారని నిలదీశారు.

ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి, న్యాయశాఖ మంత్రికి, అఖిల భారతీయ బార్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. నిర్భయ న్యాయవాదులు అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడం సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు.

ఇదీ చదవండిః గుట్టు వీడింది... కరోనా వైరస్​ పుట్టింది అలానే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.