ETV Bharat / state

పాతబస్తీలో మెట్రో పనులు వేగవంతం చేయాలి.. అక్బరుద్దీన్​ ఒవైసీ విజ్ఞప్తి - ఇమ్లీబన్​ నుంచి ఫలక్​నుమా వరకు మెట్రో పనులు

Akbaruddin Owaisi later to Metro MD: హైదరాబాద్​లోని పాతబస్తీలోని మెట్రోరైలు పనులను తక్షణమే ప్రారంభించాలని మజ్లిస్​ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్​ ఒవైసీ కోరారు. ఈ మేరకు హైదరాబాద్​ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్​ రెడ్డిని కలిసిన ఆయన మెట్రో పనులు వేగవంతం చేయాలని వినతి పత్రం ఇచ్చారు. తమ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో రూ.500 కోట్లు కేటాయించినప్పటకీ పనులు ఆలస్యం కావడం ఆశ్ఛర్యంగా ఉందన్నారు.

Akbaruddin Owaisi
Akbaruddin Owaisi
author img

By

Published : Oct 12, 2022, 4:44 PM IST

Akbaruddin Owaisi later to Metro MD: హైదరాబాద్​లోని పాతబస్తీలో మెట్రోరైలు పనులను తక్షణమే ప్రారంభించాలని మజ్లిస్​ శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్​ ఒవైసీ కోరారు. ఈ మేరకు హైదరాబాద్​ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్​ రెడ్డిని కలిసిన ఆయన మెట్రో పనులు వేగవంతం చేయాలని వినతి పత్రం ఇచ్చారు. నగరంలోని ఇమ్లీబన్​ నుంచి ఫలక్​నుమా వరకు మెట్రో కారిడర్​ పనులు చేపట్టాలని చాలా కాలంగా కోరుతున్నామని.. తమ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500కోట్ల రూపాయలు బడ్జెట్​లో కేటాయించినట్లు ఆయన తెలిపారు.

ఐదున్నర కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు పనులు నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయాలని కోరారు. త్వరితగతిన పనులు ప్రారంభించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేదని ఒవైసీ వాపోయారు. 2022-23 బడ్జెట్​లో నిధులు కేటాయించినప్పటికీ పనుల ప్రారంభంలో ఆలస్యం కావడం ఆశ్చర్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.