ETV Bharat / state

'కొవిడ్​ మృతదేహాల తరలింపునకు ఉచిత అంబులెన్స్​' - రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ అడ్వైజరీ​ ఏకే ఖాన్​

సికింద్రాబాద్​లోని లీ రాయల్​ ప్యాలెస్​లో హెల్పింగ్​ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ​ ఆధ్వర్యంలో కొవిడ్​ బారినపడి మృతిచెందిన వారి కోసం ఉచిత అంబులెన్స్​ సర్వీసులను ఏర్పాటు చేశారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ అడ్వైజరీ​ ఏకే ఖాన్​ ప్రారంభించారు.

ak khan started free ambulances at le palace in secunderabad
'కొవిడ్​ మృతదేహాల తరలింపునకు ముందుకు రావడం అభినందనీయం'
author img

By

Published : Jul 30, 2020, 9:21 PM IST

కొవిడ్ బారినపడి మరణించిన వారి కోసం ప్రత్యేకంగా సహారా అంబులెన్స్ సర్వీసులను ఏర్పాటు చేయడం మంచి పరిణామమని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ అడ్వైజరీ ఏకే ఖాన్ పేర్కొన్నారు. సికింద్రాబాద్​లోని ప్యాలెస్​లో హెల్పింగ్​ హ్యాండ్స్​ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14 అంబులెన్స్​లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా 7569600800 హెల్ప్​లైన్ నెంబర్​ను సైతం అందుబాటులోకి తెచ్చారు.

కరోనా మృతదేహాలను తరలించే క్రమంలో అనేక సమస్యలు ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందించదగ్గ విషయమని ఏకే ఖాన్​ పేర్కొన్నారు. కొవిడ్ మృతులకు అందిస్తున్న ఈ సహకారాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్​ విజృంభణ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వాడాలని, విధిగా మాస్కులు ధరించాలని కోరారు.

ఇదీచూడండి: రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధికి పటిష్ఠ చర్యలు: తలసాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.