మోదీ ప్రభుత్వం కార్మిక సంక్షేమ పథకాలను ఎత్తివేసి వారి భవిష్యత్‌ను అంధకారం చేస్తోందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బోస్ ఆరోపించారు. ఆరేళ్లలో ఎన్డీఏ సర్కార్ అవలంబించిన కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తూ, కార్పొరేట్ విధానాలను ఖండిస్తూ నవంబర్ 26న దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు.
సమ్మెకు సంబంధించిన గోడపత్రికను హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. దేశంలోని పారిశ్రామిక కార్మికులు, రైతులు, ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనాలని కోరారు. సామాన్యులకు విద్యను దూరం చేసేందుకు మరో కుట్రకు మోదీ సర్కార్ ప్రణాళికలు రచిస్తోందని ఏఐటీయూసీ అధ్యక్షుడు బాల్‌రాజ్ అన్నారు.
- ఇదీ చూడండి : కృష్ణమ్మ ఒడిలో బోటు ప్రయాణం