ETV Bharat / state

ప్రొఫెసర్ నాగేశ్వర్​ను గెలిపించండి: ఏఐటీయూసీ

ప్రొఫెసర్ నాగేశ్వర్​ను గెలిపించాలని... ఏఐటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల ప్రచార వాల్ పోస్టర్​ను యూనియన్ నేతలు ఆవిష్కరించారు.

author img

By

Published : Mar 5, 2021, 9:50 AM IST

AITUC Auto Rickshaw Drivers Union appeals to win over Professor Nageshwar. Union leaders then unveiled an election campaign wall poster.
ప్రోఫెసర్ నాగేశ్వర్​ను గెలిపించండి: ఏఐటీయూసీ

ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నించే ఆచార్య నాగేశ్వర్​ను గెలిపించాలని... ఏఐటీయూసీ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని యూనియన్​ నేతలు కోరారు. అనంతరం యూనియన్ రూపొందించిన... నాగేశ్వర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార వాల్ పోస్టర్​ను ఆవిష్కరించారు.

ఏ అంశంపైనైనా తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వెల్లడించే ఆచార్య నాగేశ్వర్​కు ​వామపక్షాలు, ప్రజాసంఘాలు, మేధావులు, ప్రజాతంత్రవాదులు బలపరుస్తున్నారని తెలిపారు. ఉద్యోగం, ఉపాధి దొరకక ఆటో డ్రైవర్లలలో 90 శాతం మంది పట్టభద్రులెనని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఫుర్తిగా విఫలమైందని... ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ది చెప్పాలని పట్టభద్రులను కోరారు.

ఇదీ చదవండి: మొదట నుంచి చిన్న కన్ఫ్యూజన్ ఉండేది: నవదీప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.