ETV Bharat / state

'మల్లారెడ్డి ఆస్తులపై సీబీఐ దర్యాప్తు చేయాలి'

మల్లారెడ్డిని మంత్రి మండలి నుంచి బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేస్తూ నారాయణ గూడలో ఏఐఎస్​ఎఫ్​ ఆందోళన నిర్వహించింది. న్యాక్​ గ్రేడింగ్​ కోసం మంత్రి అక్రమ మార్గాలను ఎంచుకుని ఆస్తులు కూడబెడుతున్నారని ఆరోపించింది. మల్లారెడ్డి ఆస్తులపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్​ చేసింది.

aisf demands for cbi enquiry on minister mallareddy assets
'మల్లారెడ్డి ఆస్తులపై సీబీఐ దర్యాప్తు చేయాలి'
author img

By

Published : Dec 26, 2020, 4:28 PM IST

మల్లారెడ్డిని మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కమిటీ(ఏఐఎస్​ఎఫ్​)డిమాండ్ చేసింది. న్యాక్ గ్రేడ్ కోసం మంత్రి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారని ఆరోపించింది. ఈ మేరకు ఏఐఎస్​ఎఫ్​ నాయకులు హైదరాబాద్​లోని నారాయణగూడలో ఆందోళన నిర్వహించారు.

ఇదొక్కటే కాదు

విద్యను వ్యాపారం చేస్తూ అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్న మల్లారెడ్డి.. న్యాక్ గ్రేడింగ్ కోసం అక్రమ మార్గాలను ఎంచుకుని దొరికిపోయారని నాయకులు విమర్శించారు. ఒక్క మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మాత్రమే కాదని.. రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉన్న ప్రముఖ కళాశాలల్లో అక్రమ మార్గాన న్యాక్​ గ్రేడ్, యూజీసీ స్వయంప్రతిపత్తి పొందుతున్నారని దుయ్యబట్టారు.

సీబీఐ దర్యాప్తు చేయాలి

మల్లారెడ్డి ఆస్తులపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ అవినీతికి పాల్పడితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. సీఎం చర్యలు తీసుకోకపోతే మల్లారెడ్డి అక్రమ ఆస్తుల్లో ఆయనకు వాటా ఉందని నమ్మాల్సి వస్తుందని వెల్లడించారు.

ఇదీ చదవండి: ఇంటికి నిప్పంటుకొని నలుగురు సజీవదహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.