రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) సభ్యులు ఆరోపించారు. బడ్జెట్లో తక్కువగా కేటాయింపులు చేయడాన్ని నిరసిస్తూ.. హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ కూడలి వద్ద బడ్జెట్ పత్రులను దహనం చేశారు.
కేంద్ర ప్రభుత్వం 1964లో నియమించిన కొఠారి కమిషన్ బడ్జెట్లో విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని సూచించిందని ఏఐఎస్ఎఫ్ సభ్యులు తెలిపారు. గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 5 శాతం నిధులను మాత్రమే కేటాయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యకు రెడ్ కార్పెట్ పరుస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యకు తక్షణమే ప్రత్యేకమైన నిధులు కేటాయించి... రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్లర్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చదవండి: జాతీయ ఉద్యోగ పరీక్షకు సిద్ధమేనా?