ETV Bharat / state

ఇంటర్​ అవకతవకలపై విద్యార్థి సంఘాల నిరాహార దీక్ష

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ... హైదరాబాద్​ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. సర్కారు స్పందించకుంటే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

నిరసన దీక్ష
author img

By

Published : May 9, 2019, 5:55 PM IST

ఇంటర్​ ఫలితాల్లో తప్పులకు బాధ్యతగా విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్‌ చేసి... బోర్డు కార్యదర్శి అశోక్‌ను సస్పెండ్ చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ సంఘాల నేతలు డిమాండ్​ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ హైదరాబాద్​ సీపీఐ రాష్ట్ర కార్యాలయం​లో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ ఆచార్య నాగేశ్వర్​ దీనిని ప్రారంభించగా కాంగ్రెస్​ నేత అద్దంకి దయాకర్​ సంఘీభావం ప్రకటించారు.

ఇంటర్​ అవకతవకలపై విదార్థి సంఘాల నిరాహాహ దీక్ష

చర్యలెందుకు తీసుకోరు

ఇంటర్​ ఫలితాల్లో అవకతవకలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మాజీ ఎమ్మెల్సీ ఆచార్య నాగేశ్వర్​ ప్రశ్నించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై చులకనగా మాట్లాడడం బాధాకరమని అన్నారు.

అవి ప్రభుత్వ హత్యలే

విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని కాంగ్రెస్​ నేత అద్దంకి దయాకర్​ ఆరోపించారు. ఇంటర్​ వ్యవహారంలో ప్రభుత్వం దోషిగా నిలిచిందని విమర్శించారు.
ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు.

ఇదీ చూడండి : ఇంటర్​ అవకతవకలపై 11న అఖిలపక్షం దీక్ష

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.