ETV Bharat / state

Air Travel: తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా పెరిగిన విమాన ప్రయాణాలు - telangana news\

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు విమాన ప్రయాణాలు చేసిన ప్రయాణీకుల సంఖ్య అక్టోబరు నెలలో భారీగా పెరిగింది. తిరుపతి నుంచి రాకపోకలు సాగించిన ప్రయాణీకులు ఏకంగా 99శాతం పెరగ్గా, కడప నుంచి 78.4శాతం పడిపోయింది. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణీకులు రెండు రెట్లు పెరగ్గా.. స్వదేశీ ప్రయాణాలు 53శాతం పెరిగాయి. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కర్నూలు విమానాశ్రయాల నుంచి జరిగిన రాకపోకలు కూడా ఆశించిన స్థాయిలో పెరిగినట్లు ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.

Air Travel: తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా పెరిగిన విమాన ప్రయాణాలు

author img

By

Published : Dec 5, 2021, 3:55 AM IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి విమానాల్లో ప్రయాణించిన ప్రయాణీకుల సంఖ్య అక్టోబరు నెలలో ఆరు లక్షలకుపైగా పెరిగింది. గత ఏడాది అక్టోబరు నెలలో రెండు రాష్ట్రాల నుంచి 10,30,975 మంది ప్రయాణించగా, ఈ ఏడాది అక్టోబరులో 16,27,807 మంది ప్రయాణించినట్లు ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు ఏడు నెలలు తీసుకుంటే గత ఏడాదిలో 33,42,408 మంది ప్రయాణించగా.. ఈ ఏడాది అదే ఏడు నెలల్లో ఏకంగా 71,40,374 మంది ప్రయాణించారు. అంటే అంతకు ముందు ఏడాది కంటే ఈ ఏడాది ప్రయాణీకుల సంఖ్య రెట్టింపునకు మించింది.

పెరిగిన ప్రయాణాలు

రెండు రాష్ట్రాల్లోని విమానాశ్రయాల వారీగా ప్రయాణం చేసిన ప్రయాణీకుల వివరాలను పరిశీలించినట్లయితే...శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గత ఏడాది అక్టోబరులో విదేశాలకు 50,627 మంది ప్రయాణించగా.. ఈ ఏడాది అదే నెలలో ఏకంగా రెండు రెట్లు ప్రయాణీకుల సంఖ్య పెరిగి.. 1,53,039 మంది ప్రయాణం చేశారు. విజయవాడ నుంచి గత ఏడాది అక్టోబరు నెలలో 7,166 మంది ప్రయాణించగా.. ఈ ఏడాది అక్టోబరులో 52శాతానికిపైగా తగ్గి కేవలం 3,436 మంది ప్రయాణించినట్లు ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. విశాఖపట్నం, తిరుపతి, కడప, కర్నూలు, రాజమండ్రి విమానాశ్రయాల నుంచి ఒక్కరు కూడా విదేశీ ప్రయాణాలు చేయలేదు. శంషాబాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌ పోర్టు నుంచి ఏప్రిల్‌ నుంచి అక్టోబరు వరకు ఏడు నెలల్లో విదేశాలకు రాకపోకలు సాగించిన ప్రయాణీకులు... గత సంవత్సరం 1,57,448 మంది కాగా.. ఈ ఏడాది అదే ఏడు నెలల్లో ఏకంగా 5,72,018 మంది ప్రయాణించారు. విజయవాడ నుంచి ఆరు నెలల్లో ప్రయాణించిన విదేశీ ప్రయాణీకుల సంఖ్య సగానికిపైగా పడిపోయింది.

తిరుపతి విమానాశ్రయం నుంచి..

అదేవిధంగా స్వదేశీ ప్రయాణాలు తీసుకుంటే తిరుపతి విమానాశ్రయం నుంచి ఏకంగా 99శాతం ప్రయాణాలు పెరిగాయి. గత ఏడాది అక్టోబరులో తిరుపతి నుంచి 29,978 మంది ప్రయాణించగా.. ఈ ఏడాది ఏకంగా 59,701 మంది ప్రయాణించినట్లు ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గత ఏడాది అక్టోబరు నెలలో 7,55,609 మంది ప్రయాణించగా.. ఈ ఏడాది 11, 55,790 మంది ప్రయాణాలు చేశారు. విజయవాడ నుంచి గత ఏడాది అక్టోబరులో 43,625 మంది ప్రయాణాలు చేయగా.. ఈ ఏడాది అదే నెలలో 55,431 మంది ప్రయాణించారు. విశాఖపట్నం నుంచి గత ఏడాది అక్టోబరులో 1,16,502 మంది ప్రయాణించగా.. ఈ ఏడాది అదే నెలలో 1,69,544 మంది ప్రయాణించారు.

రాజమండ్రి నుంచి గతేడాది అక్టోబరులో 21,601 మంది ప్రయాణించగా.. ఈ ఏడాది అక్టోబరులో 26,428 మంది ప్రయాణాలు చేశారు. కడప నుంచి గత ఏడాది అక్టోబరులో 5,097 మంది ప్రయాణించగా.. ఈ ఏడాది కేవలం 1101 మంది మాత్రమే ప్రయాణం చేశారు. మొత్తంగా గత ఏడాది అక్టోబరు నెలలో 9,72,412 మంది స్వదేశీ ప్రయాణాలు చేయగా.. ఈ ఏడాది అక్టోబరు నెలలో 14,71,332 మంది స్వదేశీ ప్రయాణాలు చేసినట్లు ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబరు నెల వరకు 31,49,615 మంది స్వదేశీ ప్రయాణం చేయగా.. ఈ ఏడాది అదే ఏడు నెలల్లో 65, 51,990 మంది ప్రయాణాలు చేశారు.

పెరిగిన విమాన రాకపోకలు

అక్టోబరు నెలలో అంతర్జాతీయ విమానాల రాకపోకలు 68శాతం, స్వదేశీ విమాన రాకపోకలు 43.3 శాతం లెక్కన పెరిగినట్లు ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్​ ఇండియా వెల్లడించింది. అదే దేశీయ, విదేశీయ విమానాల రాకపోకల సంఖ్య గత ఏడాది అక్టోబరులో 1,18,531 ట్రిప్పులు ఉండగా.. ఈ ఏడాది 1,72,948 ట్రిప్పులు రాకపోకలు సాగాయి. సరుకు రవాణాలో తీసుకుంటే అంతర్జాతీయంగా 23.8శాతం, దేశీయంగా 6.7శాతం లెక్కన వృద్ధి నమోదు చేసింది.

ఇదీ చదవండి:

Minister Puvvada ajay kumar: 'దేశంలోనే అతి పెద్ద వాహనాల తయారీ యూనిట్​లు తెలంగాణలో..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.