ETV Bharat / state

ఇకపై హైదరాబాద్ టూ అమెరికా నాన్​స్టాప్ విమానం! - తెలంగాణ తాజా వార్తలు

హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లాలనుకునేవారికి శుభవార్త. ఇకపై హైదరాబాద్ నుంచి అమెరికాకు నాన్​స్టాప్ విమానం నడవనుంది. వారానికి ఒకసారి ఈ విమాన సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ సర్వీసులు శుక్రవారం ప్రారంభమయ్యాయి.

air-india-services-from-india-to-america-non-stop-flight-services-from-hyderabad-to-chicago
ఇకపై హైదరాబాద్ టూ అమెరికా నాన్​స్టాప్ విమానం!
author img

By

Published : Jan 15, 2021, 5:16 PM IST

air-india-services-from-india-to-america-non-stop-flight-services-from-hyderabad-to-chicago
అమెరికా యానం మరింత సులభమిక...

హైదరాబాద్ నుంచి చికాగోకు నాన్​స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్-అమెరికాల మధ్య వారానికి ఒక నాన్ స్టాప్ విమానం నడవనుంది. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఎయిర్ ఇండియా ఎల్​ఐ-107 విమానం చికాగోకు పయనమైంది. ఏఐ-108 విమానం తెల్లవారుజామునే హైదరాబాద్‌కు చేరింది.

చికాగో టూ హైదరాబాద్

శుక్రవారం తెల్లవారుజామున 01.00 గంటలకు ఎయిర్ ఇండియా ఏఐ-108 నాన్​స్టాప్ విమానం 237 ప్రయాణికులు, 16 మంది సిబ్బందితో జీఎంఆర్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరింది. ప్రయాణికులు, ఎయిర్ క్రాఫ్ట్ సిబ్బందికి విమానాశ్రయ సిబ్బంది ఆహ్వానం పలికారు.

హైదరాబాద్ నుంచి చికాగో

ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 777 ఎల్ఆర్ ఏఐ- 107 నేడు సుమారు 12.50 గంటలకు హైదరాబాద్ నుంచి చికాగోకు 226 ప్రయాణీకులు, 16 మంది సిబ్బందితో బయల్దేరింది. చికాగో వెళ్లే ప్రయాణికులు, సిబ్బందికి వీడ్కోలు పలకడానికి హైదరాబాద్ విమానాశ్రయం సీనియర్ అధికారులు, ఎయిర్ ఇండియా సిబ్బంది టెర్మినల్ వద్ద బారులు తీరారు. సామాజిక దూరం పాటిస్తూ కేక్ కట్ చేశారు.

వారానికి ఒకసారి

ఏఐ-107 విమానం ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి చికాగోకు వెళ్తుంది. హైదరాబాద్ నుంచి 12.50(భారత ప్రామాణిక సమయం) గంటలకు బయలుదేరే ఈ విమానం... అదే రోజు 18.05 (అమెరికా సమయం) గంటలకు చికాగో చేరుకుంటుంది. చికాగో నుంచి హైదరాబాద్ వచ్చే బోయింగ్ 777 ఎల్​ఆర్ ఏఐ-108 ప్రతి బుధవారం చికాగో నుంచి 21.30 గంటలకు( అమెరికా సమయం) బయల్దేరి 01.40(భారత కాలమానం) గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

  • హైదరాబాద్ నుంచి చికాగో మధ్య దూరం-13,293 కి.మీ.
  • ప్రయాణ సమయం: 16 గంటల 45 నిమిషాలు.
  • చికాగో నుంచి హైదరాబాద్‌ల ప్రయాణ సమయం: 15 గంటల 40నిమిషాలు .

    ప్రతీ శుక్రవారం.. వారానికి ఓ సారే!

"చికాగో, హైదరాబాద్‌ను కలిపే ఈ కొత్త కనెక్షన్ కొంతకాలంగా కనెక్టివిటీ కావాలని కోరుతున్న జాబితాలో ఉంది. ఈ సర్వీసును ఎయిర్ ఇండియా ప్రారంభించడం ఎంతో సంతోషకరం. హైదరాబాద్ నుంచి అమెరికాకు నాన్​స్టాప్ విమానాల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణీకులకూ శుభవార్త. ప్రయాణికుల డిమాండ్లను తీర్చడానికి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ప్రమాణాల భద్రతపై దృష్టి సారించి, మరిన్ని దేశీయ, అంతర్జాతీయ నగరాలను కనెక్ట్ చేయడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాం."

-ప్రదీప్ ఫణికర్, సీఈవో, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్ లిమిటెడ్

డిమాండ్ ఎక్కువ

భారతదేశం, అమెరికాల మధ్య విమానాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఈ రెండు గమ్యస్థానాల మధ్య ఏటా 7,40,000 మంది ప్రయాణించే అవకాశం ఉంది. హైదరాబాద్ దక్షిణ, మధ్య భారతదేశానికి ముఖద్వారం లాంటిది. ప్రయాణికులకు అనుకూలం.

"యునైటెడ్ స్టేట్స్, హైదరాబాద్ మధ్య తొలిసారిగా నాన్​స్టాప్ విమానం ప్రారంభించినందుకు గర్వపడుతున్నాను. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఈ కనెక్షన్ చికాగోపై ఏడాదికి 22 మిలియన్ల ఆర్థిక ప్రభావం చూపుతుంది."

-జామీ ఎల్.రీ, సీడీఏ కమిషనర్

నలుగురిలో ఒకరు

తెలుగు ప్రజల సంఖ్య అమెరికాలో చాలా వేగంగా పెరుగుతోంది. చదువు కోసం విదేశాలకు వెళ్లే ప్రతి నలుగురు విద్యార్థుల్లో ఒకరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉంటారు. ఏటా అమెరికాకు వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారత్​ది రెండో స్థానం.

ఇదీ చదవండి: అఖిలప్రియ ఫోన్లు ఎక్కడున్నాయి? వాటినెలా స్వాధీనం చేసుకోవాలి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.