ETV Bharat / state

'వైమానిక దళంలోకి ఆకర్షించేలా కార్యాచరణలు చేపడతాం'

భారత వైమానిక దళంలోని ఉద్యోగాల వైపు రాష్ట్ర యువత ఆకర్షితులయ్యేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపడతామని సీఎస్​ సోమేశ్​ కుమార్ తెలిపారు. బీఆర్కే భవన్​లో ఆయనను భారత వైమానిక దళ కెప్టెన్​ శ్రీరాం, వింగ్​ కమాండర్​​ యోగేశ్​ కలిసి ఈ విషయంపై చర్చించారు.

air force officers to met cs somesh kumar in hyderabad brk bhavan
'వైమానిక దళంలోకి ఆకర్షించేలా కార్యాచరణలు చేపడతాం'
author img

By

Published : Mar 5, 2020, 1:52 PM IST

భారత వైమానిక దళంలోని సాంకేతిక, సాంకేతికేతర విభాగాల్లోని ఉద్యోగాల వైపు యువత ఆకర్షితులయ్యేలా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ తెలిపారు. హైదరాబాద్​ బీఆర్కే భవన్​లో సీఎస్​ సోమేష్ కుమార్​ను భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శ్రీరాం, వింగ్ కమాండర్ యోగేశ్​ మొహ్లా కలిశారు.

వైమానిక దళంలో రాష్ట్ర యువత ఉద్యోగాల విషయమై సమావేశంలో చర్చించారు. భారత వైమానిక దళంలో తెలంగాణ ఉద్యోగులు కేవలం 0.8శాతం మాత్రమే ఉన్నారని సీఎస్ తెలిపారు. రక్షణ దళాలు అందించే ఉద్యోగాకాశాల గురించి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన అన్నారు.

యువత వైమానిక దళంలోకి ఆకర్షితులయ్యేలా ప్రణాళికలు రూపొందచడం విషయమై జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు లేఖలు రాయనున్నట్లు సోమేష్ కుమార్ చెప్పారు.

'వైమానిక దళంలోకి ఆకర్షించేలా కార్యాచరణలు చేపడతాం'

ఇవీ చూడండి: బడ్జెట్​కు సీఎం ఆమోదం.. అన్ని వర్గాలకూ సానుకూలంగా పద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.